Cm kiran kumar reddy launches bangaru thalli for little girls

CM launches Bangaru Thalli for little girls, Bangaru Thalli for little girls, congress party, CM Kiran Kumar Reddy, s Bangaru Thalli scheme

CM Kiran kumar reddy launches Bangaru Thalli for little girls

సీఎం బంగారుతల్లి పథకం పై కండిషన్లు ఇవే

Posted: 07/02/2013 04:18 PM IST
Cm kiran kumar reddy launches bangaru thalli for little girls

పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో బంగారుతల్లి పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో ఎవరూ ఆడపిల్ల పుట్టిందని బాధపడే పరిస్థితి ఉండదన్నారు. మగ పిల్లలతో పోల్చితే ఆడ పిల్లల శాతం తగ్గుతున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకం ప్రకారం ఆడపిల్ల పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ అయిపోయేవరకు ప్రభుత్వం నుండి ఆమెకు ప్రభుత్వం తరపు నుండి సహాయం అందుతుంది. ప్రభుత్వం అందరి విద్యార్థులకు చెల్లించే స్కాలర్ షిప్ తో సంబంధం లేకుండా అదనంగా ఈ డబ్భును అందించనుంది. ఈ పథకం తెల్ల కార్డులు వున్నవారందరికి మాత్రమే వర్తిస్తుంది. ఆడపిల్ల పుట్టగానే 2500 రూపాయలు, పాపకి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు సంవత్సరానికి 1500 రూపాయలు, బడిలో చేరినప్పుడు 1000 రూపాయలు ఇస్తారు. 1 తరగతి నుండి 10 తరగతి వరకు సంవత్సరానికి రెండు వేల రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఇస్తారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు ఏటా 3 నుండి 4 వేల రూపాయల వరకు ఇస్తారు. డిగ్రీ పూర్తిచేసిన అమ్మాయిలకు లక్ష రూపాయలు, ఇంటర్ తోనే చదువుని ఆపేస్తే వారికి 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ ఏడాది మే 1వ తేదీ తరువాత పుట్టిన ఆడ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more