Jewellery hidden in old walls

hyderabad moghal jewellery, kutub shahi jewellery, jewellery hidden in old walls, charminar, golkonda, seven tumbs, makka maszid, historical places in hyd, hyderabad, heritage buildings,

Five held for stealing antique jewellery hidden in old walls

13.gif

Posted: 12/12/2012 06:03 PM IST
Jewellery hidden in old walls

char_1

       నాలుగు శతాబ్దాల పైచిలుకు చరిత్ర కలిగిన భాగ్యనగరంలో నేటికీ చారిత్రక సంపద బయటపడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని దూద్‌బౌలీలో ఓ ఇంటిని తవ్వుతుండగా మొఘల్, రోమన్ కాలంనాటి పాత నాణేలు, బంగారు ఆభరణాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీటిని మార్కెట్‌లో విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
      చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి దాదాపు రెండు కిలోమీటరు దూరంలోనున్న దూద్‌బౌలీలో ఓ ఇంటిని తవ్వుతుండగా దాదాపు రూ. 7 కోట్ల విలువైన పాతకాలపు నాణేలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయంటే, గోల్కొండ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో, అలాగే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నేటికీ చారిత్రక వైభవాన్ని తలపింపజేసే పాతకాలపు ఇళ్లలో, ఇతర నిర్మాణాల్లో ఎంత విలువైన సంపద దాగి ఉందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్మినార్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్ వంటి భారీ చారిత్రక కట్టడాలేగాక, చిన్నా చితకా హెరిటేజ్ భవనాలతో మొత్తం నగరంలో దాదాపు నాలుగు వందల పైచిలుకు భవనాలున్నాయి.

seven_tumbs
         వీటిలో కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉండగా, మరికొన్ని స్వల్పంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ పాతకాలపు భవనాల్లో నేటికీ పూర్వీకుల సెంటిమెంట్ అంటూ అందులో నివాసమున్న కుటుంబాలు ఇంకా ఖాళీ చేయటం లేదు. వర్షాకాలం పెను ప్రమాదం పొంచి ఉందంటూ బల్దియా అధికారులు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీచేసినా, వారు ఖాళీ చేయకపోవటం వాటిలో చారిత్రక సంపద లభ్యమవుతుందా? అన్న అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
         ఈ క్రమంలో నగరంలోని పలు చారిత్రక కట్టడాల ఆవరణల్లో అన్వేషణ ప్రారంభించాలని పురావస్తుశాఖ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. కొద్ది నెలల ముందు నిధి, పాతకాలం నాటి సొరంగం ఉందని అనుమానిస్తూ బిర్లా మందిర్ సమీపంలో అధికారులు తవ్వకాలు జరిపిన సంగతి తెల్సిందే!
ఇక పోలీసు శాఖ పాతకాలపు చారిత్రక సంపద లభ్యమైనా, దాన్ని రహస్యంగా దాచుకుని విక్రయించే వారి సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంటోంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi blame nandamuri family
Rape attempt in kukatpalli hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more