రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదిలో లాభాల్లోకి వస్తుంద ని ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషన్ (జిహెచ్ఐఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ జైసింఘానియా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలోనే (2011-12) ఈ విమానాశ్రయం బ్రేక్ ఈవెన్‌ను సాధించిందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్టు ఆయన ఇక్కడ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
హైదరాబాద్ విమానాశ్రయం సర్వీసులు ప్రారంభించిన నాలుగేళ్ల తరువాత బ్రేక్ఈవెన్‌ను సా«ధించినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా 86 లక్షల మంది రాకపోకలు సాగించారని, వీరిలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 19 లక్షలుగా ఉన్నారన్నారు. గత ఏడాది కాలం లో ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి 16 శాతంగా ఉందని చెప్పారు. దేశీయ విమానయాన పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ఏడాదిలో ఆశించిన వృద్ధి రేటు సాధించడం సవాల్‌గా మారనుందని ఆయన పేర్కొన్నారు.
గత ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికులు సంఖ్య పెద్దగా పెరగలేదని, దేశీయంగా ప్రయాణికుల సంఖ్య అధిక కావడమే ప్రస్తుత వృద్ధికి దోహదపడినట్టు విక్రమ్ చెప్పారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో 8-10 శాతం వృద్ధిని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధంలో మెరుగైన వృద్ధిని సాధిస్తామన్న అంచనా ఉందన్నారు. ఢిల్లీ విమానాశ్రయం తరువాత హైదరాబాద్ విమానాశ్రయం వేగం గా వృద్ధి చెందుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలో పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కుదురుతాయని ఆశిస్తున్నామని, దీని వల్ల మరిన్ని అంతర్జాతీయ సర్వీసులను కూడా ఇక్కడి నుంచి నడిపేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more