• చిత్రం  :

    ఇదిగో ప్రియాంక

  • బ్యానర్  :

    లక్కీ డైస్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శ్రీకాంత్ ఎన్.రెడ్డి

  • నిర్మాత  :

    సతీష్ రాజు కనుమూరి

  • సంగీతం  :

    ఘంటసాల విశ్వనాథ్

  • ఛాయాగ్రహణం  :

    ఎమ్.ఎస్.ఖాన్, సురేష్ సరంగమ్

  • ఎడిటర్  :

    ఆకాష్, వి.పవన్ కుమార్

  • నటినటులు  :

    సుదర్శన్, అనూష్, అహ్లాద్ నియోయ్

Idigo Priyanka Telug Short Film Review Tollywood
Cinema Story

శ్రీకాంత్ అనే అబ్బాయి ఎప్పటినుంచో ఒక లవర్ కోసం వేటాడుతూ వేటాడుతూ.. చివరకు తన గల్లీలోనే వున్న ప్రియాంక అనే అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. అయితే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ వున్నాడంటూ చాలాసార్లు అతని ప్రేమని తిరస్కరిస్తూ వస్తుంది. అయితే ఒకనాడు తన పిచ్చి-ఫ్రెండ్లీ-కామెడీ క్యారెక్టర్ తో ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. కట్ చేస్తే.. ముగ్గురు ఫ్రెండ్స్. శ్రీకాంత్ కూడా వారితో చేరిపోతాడు. ఆ ముగ్గురిలో ఒకరి బైక్ పోయిందనే ఆవేదనతో దేశాన్ని మార్చాలనే నినాదం లేపుతాడు. దాంతో దేశభక్తితో పొంగిపోయిన మిగతావారందరూ కలిసి దేశాన్ని మారుద్దామని వాగ్దానం చేస్తారు. వారందరికీ శ్రీకాంతే కెప్టెన్!

వాగ్దానం చేస్తుండగా అతను తన లవర్ ప్రియాంక ప్రస్తావన తీసుకొస్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ ‘‘శ్రీకాంత్ దేశాన్ని మార్చడంలో దేనికి పనికిరాడు. అతనిని మన గ్యాంగ్ నుంచి బయటికి తీసేద్దాం’ అని అంటారు. దేశభక్తి మీదున్న ప్రేమతో శ్రీకాంత్ తన ప్రేమనుసైతం వదులుకుంటాను. అలాగే ఇంట్లోవాళ్లతో గొడవపడి బయటకొచ్చేస్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్.. దేశాన్ని మారుద్దామని వాగ్దానం చేసిన వీళ్లు.. ఎలా మారుస్తారు..? అసలు దేశాన్ని మారుస్తారా..? ఒకవేళ మార్చాలని నిర్ణయిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తారు..? అసలేం జరుగుతుంది..? మళ్లీ శ్రీకాంత్ తన లవర్ ప్రియాంకను కలుసుకుంటాడా..? ఇలా ఈ నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు.

cinima-reviews
ఇదిగో ప్రియాంక

నిజానికి ఈ షార్ట్ ఫిల్మ్ లో కామెడీ, లవ్ కలిపడం ఒక చిన్న పార్టే గానీ.. బాగా విశ్లేషిస్తే ఇదొక సందేశాన్ని అందజేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టడం కోసం ఎవరూ ముందుకు రారు కానీ నీతులు మాత్రం భలే చెబుతారు. వాళ్లు రాజకీయ నాయకులైనా కావొచ్చు.. సినీ ప్రముఖులైనా కావొచ్చు.. ఇతర రంగాల్లో ప్రముఖులైనా కావొచ్చు.. అంతెందుకు ఒక సామాన్యా మానవుడు సైతం కేవలం లాజిక్స్ మాట్లాడుతాడే తప్ప.. తాను చెప్పిన నియమాలనే పాటించడు. అలా కాకుండా అందరూ దృక్పథంతో చేయి కలిపి దేశంలో కాకపోయినా కనీసం మన సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేలా ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పరుచుకోవాలి.. ఎవరెలా చెబుతున్నారు.. ఎలా వ్యవహరిస్తున్నారు.. అన్నది కాదు ముఖ్యం.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ ముందుకు కదలాలనే ఉద్దేశంతోనే దీనిని రూపొందించారు. రియల్లీ ఇట్స్ ఏ కామెడీ అండ్ ఇన్స్ పిరేషనల్ షార్ట్ ఫిల్మ్.