పునబాబు అనే అబ్బాయి ఫేస్ బుక్ కు చాలా అడిక్ట్ అయిపోయి వుంటాడు. ఎంతగా అంటే.. తన ఫోటోకు ఎక్కువ లైక్స్ రాలేదని ఆత్మహత్య చేసుకోవడానికి సైతం సిద్దమయ్యి వెళతాడు. తాను దూకడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అతని ఫ్రెండ్ వచ్చి బాబును కాపాడుతాడు. ‘‘ఎందుకు చచ్చిపోతున్నావురా బాబు?’’ అని అతని ఫ్రెండ్ తనకి క్వశ్చన్ వేస్తే.. దిమ్మతిరిగే సమాధానమిస్తాడు. అదేనండి... లైక్స్ రావడం లేదని! దీంతో ఆ ఫ్రెండ్ కళ్లు ఒక్కసారి బైర్లు కమ్ముతాయి. అయితే ఫ్రెండ్ బాధని చూసి అతనికి ఎలాగైనా లైక్స్ తెచ్చిపెట్టాలనే నెపంతో అతనొక ఐడియా ఇస్తాడు.
ఫేస్ బుక్ లో ఫోటో అప్ లోడ్ చేయించి, బూస్ట్ ద్వారా మార్కెటింగ్ చేయిస్తాడు. ఆ దెబ్బతో అతనికి వంద, రెండొందలంటూ బాగా లైక్స్ వచ్చివాలతాయి. అయితే ఒకసారి అతనికి ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇక్కడే సరికొత్త ట్విస్ట్! ఆ అమ్మాయి ఎవరు..? ఇతనికి ముందే తెలుసా..? ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు పంపించింది..? ఆ అబ్బాయి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడా..? అసలు కథ మలుపు ఎలా తిరుగుతుంది..? అనే నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు.
ఈమధ్య యువతీయువకులందరూ ఫేస్ బుక్ ను విపరీతంగా వాడుతున్న సంగతి తెలిసిందే! తమ చేతిలో స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటూ 24 గంటలు ‘‘నేను షాపింగ్ కి వెళ్లాను... దిస్ ఈజ్ మై న్యూ పిక్.. హే గాయ్స్ వాస్సాప్’’ లాంటి చెత్తచెత్త పనులు చేసుకుంటూ కూర్చుంటున్నారు. అంతేకాదు.. ఫేస్ బుక్ లో ఎవడుపడితే వాడు రిక్వెస్ట్ లు పంపిస్తే.. ఆడి గురించి ఆరాతీయకుండా ఆక్సెప్ట్ చేసేస్తారు. అందులోనూ అమ్మాయిలు రిక్వెస్ట్ పంపిస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసి, అప్పుడే ఛాటింగ్ కూడా మొదలెట్టేస్తారు. అయితే ఈకాలంలో అమ్మాయిల పేర్లమీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, మోసం చేస్తున్న వైనాలు ఎక్కువయిపోయాయి. పైశాచికానందం పొందడానికో లేదా ఇతర కారణాలో తెలియదు కానీ.. అమ్మాయిల ఫోటోలను పెట్టుకుని ఇతరులను మోసం చేసే సంస్కృతి ఫేస్ బుక్ లో విపరీతంగా పెరిగిపోయింది. ఆ కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఫేస్ బుక్ ఎక్కువ యూజ్ చేసేవారికి ఈ షార్ట్ ఫిల్మ్ ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు.