తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కూడా సెంటిమెంట్ బలంగా వెంటాడుతుందని టాక్. చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా చిత్రం.. కోసం అభిమానులు మరో ఏడాది అగాల్సిందేనన్న చేదు వార్త ప్రస్తుతం చిత్రపురి వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్డును ఇప్పటికే పట్టాలెక్కింది. అయితే ఈ షెడ్యూలు ముగించడంలో మాత్రం.. వరుస షూటింగ్లకు బ్రేకులు పడుతున్నాయని టాక్. దీంతో ఇక వచ్చే ఏడాది విడుదల కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట సినిమా నిర్మాణ వర్గాలు. అందుకునే సురేందర్ రెడ్డి ఈ సినిమా షూటింగు వేగాన్ని పెంచినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కి కూడా చాలా సమయం పట్టనుందట. అందువలన ఆ వైపు నుంచి కూడా పనులను వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే 9వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలు ఇదే రోజున విడుదలై సంచలన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని అదే రోజున విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more