క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేయాలన్న ఆలోచన ఒక ఎత్తు అయితే వాటిని సరైన కాస్ట్ క్రూ తో తెరకెక్కించే దమ్మున్న దర్శకుడు దొరకటం మరో ఎత్తు. అలాంటి వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఎగబడిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు టేకింగ్, మెగాస్టార్ రాకింగ్ ఫెర్ ఫార్మెన్స్, అన్నింటికీ మించి దేవకన్యగా శ్రీదేవీ అందం, పాటలు ఇలా అన్నీ ఫీక్స్ లో ఉండటంతో సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది.
దీంతో ఎలాగైనా దానికి సీక్వెల్ చేయాలని నిర్మాత అశ్వనీదత్ ఎప్పటి నుంచో ఫ్లాన్ వేసుకుంటూనే ఉన్నాడు. అంతలోనే మెగా వారసుడు సినీ ఆరంగ్రేటం చేయటంతో ఆ పని మరింత సులువైందని దత్ భావించాడు. మగధీర తర్వాత రాజమౌళి దర్వకత్వంలోనే దీనిని అనుకున్నప్పటికీ ఎడతెరపని జక్కన్న షెడ్యూల్ తో ఆ ప్రయత్నం పక్కకు జరిగింది. అదే సమయంలో తన తండ్రి సినిమాల జోలికి పోయే వాటిని చెడగొట్టడం ఇష్టం లేదని చెర్రీ కూడా ఓపెన్ గా ప్రకటించాడు. ఆ దెబ్బకి ఆ ఆలోచన మూలన పడిపోయిందని అంతా భావించారు.
అయితే సీక్వెల్ కాకుండా రీమేక్ చేసే ఆలోచనకి మారిపోయాడంట నిర్మాత అశ్వనీదత్. ఈ విషయంలో చెర్రీని కూడా అల్రెడీ కన్వెన్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలి బిజీలో ఉన్న రాజమౌళి ఎలాగూ దొరకడు కాబట్టి మరో దర్శకుడితో ఈ రీమేక్ ను పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టకుండా తెరకెక్కించే దమ్ము ఎవరికి ఉందంటారు?
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more