mohanbabu wants to remake asembly rowdy movie with his son vishnu

Mohanbabu wants to remake asembly rowdy movie with his son vishnu

mohanbabu son, manchu vishnu, vishnu remakes movie, asembly rowdy movie, asembly rowdy remakes, mohanbabu remakes his movies, asembly rowdy movie remaking, director b gopal remakes

mohanbabu wants to remake asembly rowdy movie with his son vishnu. And said only b gopal director can remake this film again, vishnu is not suitable for this charechtor and remake stories does't suits in this generation

అది నీకు సెట్ అవుతుందా ? లేదా ?

Posted: 06/06/2016 04:09 PM IST
Mohanbabu wants to remake asembly rowdy movie with his son vishnu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో 'అసెంబ్లీ రౌడీ' కూడా ఒకటి. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవలే ఆ సినిమా జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ.. ఈ చిత్రాన్ని తన పెద్ద కొడుకు మంచు విష్ణు హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు మోహన్ బాబు. అసెంబ్లీ రౌడీ రీమేక్ గురించి ఎప్పటినుంచో అనుకుంటున్నాం.

ఇప్పుడైనా సరే బి.గోపాల్ మాత్రమే ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యగలడని చెప్పాడు. విష్ణు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో ఈ రీమేక్ గురించి మరిన్ని విశేషాలు చెబుతాను అని మోహన్‌బాబు చెప్పారు.

అయితే, అప్పట్లో అసెంబ్లీ రౌడీ సినిమా టైటిల్ పై వివాదాలు నెలకొన్నాయి. ఇలాంటి సినిమా టైటిల్ తో మళ్లీ మంచు విష్ణుతో ఈ సినిమా తీస్తే అసలు ఆ క్యారెక్టర్ విష్ణుకి ఎంత వరకూ సెట్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో దివ్యభారతి లాంటి క్యారెక్టర్ చెయ్యాలంటే ఇప్పుడున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే చెయ్యగలదని, అయినా అదే సేమ్ స్టోరీని మళ్లీ రీమేక్ చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చెప్పలేమని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

అసలే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అ-ఆ సినిమా మీనా సినిమానే అని ధ్వజమెత్తిన సోషల్ మీడియా ఇప్పుడు మళ్లీ పాత సినిమాల రీమేక్స్ అంటే అదే సినిమాతో ఖచ్చితంగా పోల్చుతారని, అందుకే ఇలాంటి రీమేక్స్ ఇక రాకుండా ఉంటేనే పాత సినిమాల విలువ తగ్గకుండా అలాగే ఉంటుందని సినీ పండితులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohanbabu  manchu vishnu  asembly rowdy movie  b goapal director  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more