nithya menon worried about dance with tarak in JG

Nithya menon worried about dance with tarak in jg

jr ntr, jr ntr with nitya menon, nitya menone dance, nithya dance, jr ntr vs nithya, koratala siva nithya, nithya menone acting, jantha garrage shooting

nitya menon working hard in janatha garrage movie. and doing dance practice and special classes for this movie. she is doing dance with jr ntr in this movie.

పాపకి టెన్షన్ మొదలైంది...!

Posted: 06/01/2016 02:50 PM IST
Nithya menon worried about dance with tarak in jg

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యామీనన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనతా గ్యారేజ్ టీమ్ చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది.
ఈ సినిమా షూటింగ్ కి ఇప్పటికే అక్కడ తారక్ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైపోయింది.

అంతేకాకుండా సినిమాకి సోషల్ నెట్ వర్క్స్ లో వస్తున్న హైప్ కి తమిళ స్టార్లు సైతం ఆశ్చర్యపోతున్నారట. జూనియర్ ని కలిసేందుకు ఒక్కొక్కరుగా సెట్స్ లోకి వచ్చి కాసేపు సందడి చేసి వెళ్తున్నారట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి అవుతుందని, ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో నిత్యామీనన్, జూనియర్ ఎన్టీఆర్ లపై ఒక పాటని చిత్రీకరించనున్నారు. ఇప్పుడు ఈ పాటను తలుచుకుంటేనే నిత్యామీనన్ కి టెన్షన్ ఎక్కువైపోతుందట. ఎందుకంటే, తారక్ తో కలిసి డ్యాన్స్ చెయ్యాలంటే తనవల్ల కాదని డైరెక్టర్ కి చెప్పిందట ఈ అమ్మడు.

దీంతో డైరెక్టర్ నిత్యామీనన్ కి స్పెషల్ గా ఒక కొరియోగ్రాఫర్ ని అప్పగించి ప్రాక్టీస్ చేయినస్తున్నట్లుగా సమాచారం. గతంలో నిత్యామీనన్ కేవలం పెర్ఫామెన్స్ పాటల్లో మాత్రమే నటించింది. ఎక్కడా పెద్దగా డ్యాన్స్ చేసిన అనుభవం కూడ లేకపోవడంతో ఇప్పుడు తారక్ తో కలిసి స్టెప్పులు వెయ్యాలంటే టెన్షన్ పడుతోందట.

అసలే జూనియర్ ఎన్టీఆర్ భయంకరమైన డ్యాన్సర్ , అందులోనూ దేవిశ్రీప్రసాద్ బీట్ సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ డేట్స్ దగ్గరకి వస్తుండటంతో చేసేది ఏమీలేక డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టిందట నిత్యా. ప్రేమరక్షిత్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈపాట కోసం ప్రస్తుతం సారధి స్టూడియోస్ లో సెట్ పనులు జరుగుతున్నాయి.

- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jr ntr  nithya menon  koratala siva  samantha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more