సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గతంలో ఈ అమ్మడు తన వరుస హిట్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. మొదటగా శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమవడం.. ఆ తర్వాత వీరిద్దరికి దూరమవ్వడం జరిగింది. వీరిద్దరికి దూరమయిన తర్వాత పూర్తిగా సినిమాలకే తన జీవితం అంకితమిచ్చినట్లుగా వరుస సినిమాలతో, సక్సెస్ లతో దూసుకుపోతుంది.
అయితే గతంలో ఈ అమ్మడు శింబుతో ‘వల్లభ’ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ సెన్సేషన్ సృష్టించింది. మళ్లీ అలాంటి సీన్ ను కావాలనే ఓ డైరెక్టర్ కోరుకుంటున్నాడట. శింబు నటించిన ‘ఇదు నమ్మ ఆలు’ సినిమా గతకొద్ది కాలంగా షూటింగ్ పూర్తికాకుండా, విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో శింబు, నయనతారలు జంటగా నటిస్తున్నారు. అసలే హిట్లు లేక శింబు విలవిలలాడుతున్నాడు.
ఆగిపోయిన ఈ సీన్ లో అలాంటి ఓ లిప్ లాక్ సీన్ ఉందట. ఇప్పటికే ఈ సినిమా కోసం తాను ఇచ్చిన కాల్ షీట్స్, డేట్స్ పూర్తయ్యాయి. పైగా మరిన్ని డేట్స్ కావాలంటే మరింత రెమ్యునరేషన్ ఇవ్వాలని నయనతార కోరింది. కాగా ఈ ప్రత్యేక లిప్ లాక్ సీన్ కోసం నయనతారను సంప్రదిస్తే... భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ లిప్ లాక్ సీన్ కోసం ఎక్స్ ట్రా గా మరో యాభై లక్షలు ఇవ్వాలని నయనతార డిమాండ్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ అమ్మడు కరుణించి రెమ్యునరేషన్ తగ్గిస్తుందో లేదా లిప్ లాక్ సీన్ లేకుండానే ఈ సినిమాను విడుదల చేస్తారనే విషయం త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more