ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఈ భామ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. గతంలో బాలీవుడ్ ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన మమత కులకర్ణి, అప్పట్లో దాదాపు 11 ఏళ్ల పాటు ఆమె తన హవా కొనసాగించారు. అయితే ఆ తర్వాత హోటల్ వ్యాపారానికి పరిమితం అయి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆమె భర్త వీకీ గోస్వామిని 1997లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడగా…ఇస్లాం మతంలోకి మారడంతో పదేళ్లు శిక్ష తగ్గించి 2012లో విడుదల చేసారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కెన్యాలోని నైరోబీకి మకాం మార్చి అక్కడ కూడా డ్రగ్స్ అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు.
గతంలో వికీ గోస్వామి డ్రగ్స్‌తో కెన్యా పోలీసులకు పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇపుడు మమత కులకర్ణి పేరు కూడా డ్రగ్స్ రాకెట్లో బయట పడింది. ఆమె నిషేదిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేదిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని సీజ్ చేసారు. ఈ స్మగ్లింగులో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు. వికీ గోస్వామిపై ఇంటర్ పోల్ నోటీసు ఉండటంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత భార్య మమత కులకర్ణికి అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోనూ ఆమె డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. విక్కీ గోస్వామి చాలా కాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నా…ఆయన భార్య మమత కులకర్ణి పేరు బయటకు రాలేదు. అయితే ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మమత కులకర్ణి కూడా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిందనే విషయం బయటకు వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more