NTR | Mohanlal | Janatha Garage | Stills

Mohanlal janatha garage updates

Mohanlal happy with Janatha Garage, Mohanlal Janatha Garage updates, Janatha Garage movie updates, Janatha Garage details, Janatha Garage news, NTR movies, NTR movie updates, NTR stills

Mohanlal Janatha Garage updates: Malayalam super star mohanlal latest telugu film Janatha garage. young tiger hero, koratala shiva director.

‘జనతా గ్యారెజ్’ వల్ల ఏకంగా 4 కోట్లు?

Posted: 03/22/2016 12:13 PM IST
Mohanlal janatha garage updates

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమా ద్వారా మోహన్ లాల్ కు దాదాపుగా 4 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో నటించేందుకు మోహన్ లాల్ కు ‘జనతా గ్యారేజ్’ నిర్మాతలు 1.5 కోట్ల రూపాయలతో పాటు మలయాళ హక్కులను కూడా ఆఫర్ చేసారట. మలయాళ హక్కులు ఓ కోటి రూపాయలు పలుకుతాయని భావించిన నిర్మాతలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది మలయాళ ఇండస్ట్రీ.

మలయాళంలో మోహన్ లాల్ కు భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అందుకు ఈ చిత్ర మలయాళ హక్కులు ఏకంగా 4 కోట్లకు అమ్ముడుపోయి, మోహన్ లాల్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో మలయాళంలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Mohanlal  Janatha Garage  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more