Bahubali Movie | Audio Launch Venue

Bahubali movie audio launch venue

Bahubali Audio Launch Venue Confirmed, Bahubali Audio Launch Venue, Bahubali audio launch date, Bahubali audio date, Bahubali latest news, Bahubali movie news, Bahubali songs date, Bahubali latest updates, Bahubali movie latest stills, Bahubali

Bahubali Movie Audio Launch Venue: Director SS Rajamouli most prestigious and Tollywood's highly anticipated film Bahubali. MM Keeravani Music. Prabhas, Rana, Anushka, Tamannah acts in lead roles.

బాహుబలి ఆడియో వేదిక విశేషాలు

Posted: 05/25/2015 04:01 PM IST
Bahubali movie audio launch venue

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 31న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే.

కీరవాణి స్వరపరిచిన ‘బాహుబలి -ది బిగినింగ్’ పాటలను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్, అగ్ర సినీ ప్రముఖులు, అలాగే బాలీవుడ్ అగ్ర సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఈ ఆడియో వేడుక కోసం హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకాబోతుండటంతో హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అంతే కాకుండా సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర, స్టార్ సినీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆడియో వేడుకలోనే ‘బాహుబలి -ది బిగినింగ్’ థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేస్తుండటంతో ఓ భారీ LED స్క్రీన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు హీరో నాని వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. అలాగే ఇదే వేదికపై కీరవాణికి ఘన సన్మానం కూడా జరుగనుందని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్, సుధీప్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Audio launch venue  Posters  Videos  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more