Balakrishna has given green signal to kalyan ram to produce his 100th movie | boyapati srinu

Balakrishna 100th movie green signal kalyan ram producer boyapati srinu

balakrishna, balakrishna news, balakrishna 100 movie, balakrishna kalyan ram, balakrishna gallery, balakrishna photos, balakrishna photo shoot, balakrishna news, balakrishna movie, junior ntr, junior ntr movies, kalyan ram news, kalyan ram movies

Balakrishna 100th movie green signal Kalyan Ram Producer boyapati srinu : According to tollywood sources.. Balakrishna has given green signal to kalyan ram to produce his 100th movie which is to be directed by boyapati srinu.

నందమూరివారి ‘100’వ కలయిక.. అభిమానులకు కన్నులపండుగ

Posted: 04/23/2015 10:44 AM IST
Balakrishna 100th movie green signal kalyan ram producer boyapati srinu

గతకొన్నాళ్ల క్రితం నందమూరి కుటుంబసభ్యుల మధ్య విభేదాలు రాజుకున్న విషయం తెలిసిందే! అయితే.. జానకిరాం హఠాన్మరణం వీరందరినీ మళ్లీ ఏకతాటిపై నిలిపింది. వీరిమధ్య అప్పటివరకున్న సమస్యలు ఒక్కసారిగా సమసిపోయాయి. కానీ.. బాలయ్య మాత్రం తన అబ్బాయ్ లైనా ఎన్టీఆర్, కల్యాణ్ నుంచి కాస్త దూరం మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. సినిమాలు, రాజకీయ వ్యవహారాలతో బిజీగా వున్న నేపథ్యంలో వీరంతా దూరంగా వున్నారని ఆమధ్య వార్తలొచ్చినా.. అందులో క్లారిటీ లేకపోయింది. వీరిమధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు మళ్లీ వ్యక్తమయ్యాయి. అయితే.. ఇప్పుడా సందేహాలను ఫుల్ స్టాప్ పెడుతూ బాబాయ్, అబ్బాయిలు ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చినట్లు సమాచారం!

నందమూరి కుటుంబానికి సంబంధించి తరుచుగా వస్తున్న విభేదాల వార్తలను చెక్ పెట్టేందుకు వీరంతా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బాలయ్య 100వ సినిమా ప్రాజెక్టుని తన అబ్బాయి కల్యాణ్ రామ్ చేతిలో పెట్టాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఈ చర్చలే కొనసాగుతున్నాయి. పైగా.. బాబాయ్ ఒప్పుకుంటే ఆయన 100వ సినిమాను తాను నిర్మిస్తానని కల్యాణ్ ఇదివరకే పేర్కొన్నాడు కూడా! ఈ నేపథ్యంలో వీరందరూ కలిసి ఈ మూవీ గురించి చర్చించుకున్నారని.. అనంతరం కల్యాన్ రాంకి బాలయ్య నిర్మాణ బాధ్యతలు అప్పగించాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లో తిరుగులేని ‘సింహా’, ‘లెజెంట్’ వంటి హిట్స్‌ని అందించిన బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

మొదట బాలయ్య 100వ సినిమాను ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలను నిర్మించిన టాప్ ప్రొడ్యూసర్సే నిర్మించే అవకాశం వుందని మొన్నటివరకు ఓ ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్‌గా బాలయ్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ ప్రాజెక్టుని తన తండ్రి పేరిట నిర్వహిస్తున్న ఓ ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తే అది తన తండ్రికి తాను, తన కుటుంబం ఇచ్చే అంతిమ నివాళిగా భావించవచ్చని బాలయ్య పునరాలోచనలో పడ్డాడనేది లేటెస్ట్ టాక్. అందుకే కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌’పైనే ఈ సినిమాని నిర్మించడానికి బాలయ్య బాబు సుముఖంగా వున్నారని కొన్ని మీడియా, సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  kalyan ram  junior ntr  boyapati srinu  balayya 100 movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more