త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే బన్నీ ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొన్నాడు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మినహ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. ఈ సినిమాలో బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. ప్రముఖ టీవి ఛానెల్ ‘స్టార్ మా’(మాటివి) ‘సన్నాఫ్ సత్యమూర్తి’ శాటిలైట్ హక్కులను భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి స్టిల్, పోస్టర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ విడుదల కాకముందే... ఇంత భారీ మొత్తంలో ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం పట్ల చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వున్నారని తెలిసింది.
కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more