Director gautam menon turned singer uppu karuvadu tamil movie radhakrishna

gautam menon news, director radhakrishna, uppu karuvadu tamil movie, gautam menon latest news, gautam menon singer, gautam menon singing talent, music director steve

director gautam menon turned singer uppu karuvadu tamil movie radhakrishna : gautam menon turned as singer for uppu karuvadu tamil movie which is directed by radhakrishna who already worked for gauravam movie.

గాయకుడిగా అవతారమెత్తిన దర్శకుడు

Posted: 02/28/2015 10:52 AM IST
Director gautam menon turned singer uppu karuvadu tamil movie radhakrishna

ఇటీవలే ‘ఎన్నై అరిందల్’ చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు గౌతమ్ మీనన్.. ఇప్పుడు తన గొంతును సవరించుకునే పనిలో నిమగ్నమయ్యాడు. నిన్నటివరకు వెండితెరపై తన దర్శకమాయాజాలాన్ని ప్రదర్శించిన ఈయన.. ఇప్పుడు తనలో దాగివున్న సింగింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అబ్బురపరిచేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలొస్తున్నాయి.

తెలుగులో ‘గౌరవం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తమిళంలో ‘ఉప్పు కరువాడు’ పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలోనే గౌతమ్ మీనన్ ఓ పాట పాడినట్లు సమాచారం! ముందుగా ఆయన పాట పాడేందుకు అంగీకరించలేదట! తన గొంతు వినసొంపుగా వుండదని, తాను పాట పాడితే దాన్ని ప్రేక్షకులు ఆస్వాదించలేరంటూ ఆయన ఒప్పుకోలేదట! అయితే.. ఈ చిత్ర సంగీత దర్శకుడైన స్టీవ్ ఎంతో కష్టపడి ఆయన్ను ఒప్పించాడట! దీంతో ఆయన పాట పాడేందుకు అంగీకరించాడని యూనిట్ బృందం అంటోంది.

ఇదే విషయమై ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. గౌతం గాన ప్రతిభ తనకు తెలుసునని, కొన్ని పార్టీలలో ఆయన పాటలు పాడిన విధానం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. గౌతంలో ఎవరికీ తెలియని సింగింగ్ టాలెంట్ దాగి వుందని, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయనతో పాట పాడించాలని నిర్ణయించినట్లు కృష్ణ పేర్కొంటున్నాడు. మదన్ రచించిన ఈ పాటలో జీవితం గురించి ఆలపించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. దర్శకుడు రాధాకృష్ణ, గౌతం మీనన్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. వీరి మధ్య వుండే ఈ స్నేహం గౌతం గొంతును సవరించడంలో సాధ్యపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gautam menon  director radha krishna  uppu karuvadu tamil movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more