Manchu lakshmi multi starrer special song dongata movie tollywood news

manchu lakshmi news, manchu lakshmi dongata movie, dongata movie news, dongata movie updates, manchu lakshmi hot photos, akkineni nagarjuna, raviteja, rana daggubati, nani, simbu, susanth, tollywood news, adavi sesh

manchu lakshmi multi starrer special song dongata movie tollywood news : Manchu Lakshmi is planning to do a special in her latest dongata movie with south industry stars.

దక్షిణాది హీరోలతో స్టెప్పులేయిస్తున్న మంచులక్ష్మీ

Posted: 02/26/2015 11:38 AM IST
Manchu lakshmi multi starrer special song dongata movie tollywood news

మంచుఫ్యామిలీవారి వారసురాలు మంచులక్ష్మీ తన సినిమాల్లో సరికొత్త ఆలోచనలతో ప్రత్యేక ఎలిమెంట్లు జోడించడంలో ఎప్పటికీ ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా తాను నటిస్తున్న సినిమాలో మరో కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం! అదేమిటంటే.. దక్షిణాదిన వున్న కొంతమంది పాపులర్ హీరోలతో ఈమె స్టెప్పులు వేయించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

ప్రస్తుతం మంచులక్ష్మి ‘దొంగాట’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె సరసన అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే ఆమె ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ మూవీలోని ఓ పాటలో కొంతమంది హీరోలను నటింపజేస్తోంది. వారిలో అక్కినేని నాగార్జున, రవితేజ, రానా, నాని, శింబు, సుశాంత్ వంటి హీరోలను ఈ పాటకోసం ఓకే చేసుకుందట! ఇంకా మరికొంతమంది హీరోల కోసం ఈమె ప్రయత్నాలు కూడా చేస్తోందని సమాచారం!

తాను నటించబోయే ‘దొంగాట’ సినిమాకు క్రేజ్ పెంచుకోవడం కోసమే ఈమె ఈ విధంగా హీరోలతో డ్యాన్స్ చేయించనుందని అంటున్నారు. ఇందుకోసం ఆమె భారీగానే డబ్బులు వెచ్చించేందుకు సిద్ధమైందట! మరి.. ఈ స్సెషల్ సాంగ్ తన సినిమాకు హెల్ప్ అవుతుందా..? లేదా..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu laskhmi  dongata movie  multi starrer telugu songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more