శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ సినిమాకు గోపిసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. వినసొంపైన పాటలతో పాటుగా రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేసాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.
తాజాగా గోపిసుందర్ కు ఓ భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కింది. ‘ఎవడు’ చిత్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలలో నటించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ pvp బ్యానర్లో నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మించనున్నాడు.
ఈ సినిమాకు ముందుగా దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఇపుడు దేవి స్థానంలో గోపిసుందర్ ను ఎంపిక చేసారు. అందుకే ఈ మల్టీస్టారర్ చిత్రానికి గోపిసుందర్ ను తాజాగా సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. ఇందులో కార్తీ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చి చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more