సౌత్ హీరోయిన్ త్రిష నిశ్చితార్థం ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత అయినటువంటి వరుణ్ మనియన్ తో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లిచేసుకోనున్న వీరి జీవితంలోకి బెదిరింపులతో గందరగోళం మొదలయ్యిందని తెలిసింది.
వరుణ్ మనియన్ ప్రముఖ క్రికెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేయబోతున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై వరుణ్ మనియన్ కూడా ఖండించాడు. తాను ఎలాంటి జట్టును కొనుగోలు చేయడంలేదని తేల్చేసాడు. అయినా కూడా ఈ వార్తలు ఆగడంలేదు.
దీంతో కొంతమంది అగంతకులు వరుణ్ కు ఫోన్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. కేవలం ఒక్క గంటలోనే నాలుగైదు సార్లు బెదిరింపు కాల్స్ రావడంతో వరుణ్, త్రిషలు భయపడుతున్నారట.
దీంతో వరుణ్ ఆదివారం స్థానిక తేనాంపేటలో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను బెదిరిస్తున్న ఆగంతుకులపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపినట్లుగా తెలిసింది. వరుణ్ కు ఇలాంటి కాల్స్ రావడంతో త్రిష కూడా చాలా కంగారుపడుతోందట.
ఈ విషయంపై ఇద్దరూ కూడా అతిత్వరలోనే మీడియా ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేయడం లేదని చెప్పడానికి రాబోతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం త్రిష, వరుణ్ లు తమ పెళ్లి పనుల్లో బిజీగా వున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more