Ms narayana condolence meeting movie art association tollywood news

ms narayana death news, ms narayana condolence, ms narayana death, ms narayana movies, movie art association, maa news, ms naranayan family members, ms narayana daughter

ms narayana condolence meeting movie art association tollywood news : movie art association ignores to make condolence meeting of ms narayana in tollywood.

టాలీవుడ్’లో నవ్వులరేడుకి పరాభావం!

Posted: 01/31/2015 01:15 PM IST
Ms narayana condolence meeting movie art association tollywood news

తన నటనతో, కామెడీ పంచ్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమేడియన్’గా సుస్థిరస్థానం సాధించిన ఎమ్మెస్ నారాయణ.. ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే! కేవలం 20ఏళ్ల సినీకెరీర్’లో దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి నవ్వుల జల్లులు కురిపించారు. అలా అందిరినీ నవ్వించిన ఈ నవ్వులరేడుకి నేడు టాలీవుడ్’లో పరాభావం ఎదురయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ నటీనటులు ఎవరైనా మరణిస్తే.. వారి గౌరవార్థం సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎమ్మెస్ మృతిచెందిన వారం రోజులు అయినప్పటికీ.. ఆయన సంస్మరణ సభ ఏర్పాటు విషయంపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ గాని, మూవీ అసోసియేషన్ కాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి గాని, దర్శకుల మండలిగానీ పట్టించుకోవడం లేదు. ఆ మాటకొస్తే తమకు ఏమీ తెలియదన్నట్లుగా అందరూ వ్యవహరిస్తున్నారని సమాచారం! దీంతో తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇంకా ఎమ్మెస్ సంస్మరణ సభ ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ఎమ్మెస్ సంస్మరణ సభ ఏర్పాటు విషయంపై ఆయన కుటుంబసభ్యులు ‘'మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా)'ని సంప్రదించారట! అయితే.. అలాంటి సభ ఏర్పాటు నిర్వహించేది లేదని వారు సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు చేసేదేమీ లేక బాధతో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms narayana condolence meeting  movie art association  telugu film industry  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more