Pawan kalyan remuneration gopala gopala movie collections

pawan kalyan remuneration, pawan kalyan gopala gopala movie, gopala gopala collections, venkatesh remuneration, pawan kalyan updates, pawan kalyan demand, gopala gopala latest news, producer suresh babu

pawan kalyan remuneration gopala gopala movie collections : pawan kalyan will get 15 crores as remuneration for gopala gopala movie. Till date is collected 43 crores above as per trade in 10 days.

‘గోపాలుడు’ బాగానే పుచ్చుకున్నాడు...

Posted: 01/22/2015 01:07 PM IST
Pawan kalyan remuneration gopala gopala movie collections

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. పవన్ మేనియాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ట్రేడ్ పండితుల ప్రకారం ఈ చిత్రం రూ.43 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే.. ఈ చిత్ర నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందన్న విషయాన్ని సురేష్ బాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న పవన్, శరత్ మరార్’లు సైతం నిర్మాణఖర్చుల వ్యవహారాలను బహిర్గతం చేయలేదు. ఏదైతేనేం.. ప్రస్తుతం ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తోంది కాబట్టి.. అందరూ ఇప్పుడు లాభ, నష్టాలను పంచుకునే పనిలో బిజీ అయిపోయారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం!

నిజానికి ఏదైనా చిత్రం ప్రారంభించడానికి ముందు ఆ మూవీ హీరోలకు ముందుగానే సగం పారితోషికాన్ని నిర్మాతలు ఇచ్చేస్తారు. అయితే ‘గోపాల గోపాల’ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే.. ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ మరార్, సురేష్ బాబులకు పవన్, వెంకీలు చాలా దగ్గర సన్నిహితులు! వెంకీ, సురేష్ బాబు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కాగా, పవన్’కి శరత్ మరార్ అత్యంత సన్నిహితుడు! అందుకే.. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుగానే వీరందరూ పారితోషిక వ్యవహారాలపై ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసిందో ఆ డబ్బులను అంతా కలిసి షేర్ చేసుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే మూవీ 40 కోట్ల క్లబ్’లోకి చేరిందని కాబట్టి.. ఇప్పుడు తమతమ వాటాలను షేర్ చేసుకునినే పనిలో మునిగిపోయారు.

ఒప్పందం ప్రకారం.. పనవ్, అతని సన్నిహితుడు శరత్ రూ.20 కోట్ల షేర్ పొందుతారు. ఇందులో పవన్’కు పారితోషికంగా రూ.15 కోట్లు దక్కనుండగా.. రూ.5 కోట్లు అతని సన్నిహితుకి చేరుతుంది. ఇక మిగిలిన మొత్తంలో వెంకీకి రూ.6.5 కోట్లు పారితోషికంగా లభించగా తక్కిన ప్రాఫిట్ నిర్మాత సురేష్’కే దక్కునున్నట్లు ట్రేడ్ సమాచారం! ఈ మొత్తం లెక్కల ప్రకారం చూస్తుంటే.. చిత్రనిర్మాణానికి అంతగా ఖర్చు అవ్వలేదనే తెలిసిపోతుంది. మొత్తం ఖర్చు 25 నుంచి 30 కోట్ల వరకు వుంటుందని ట్రేడ్ పండితుల అంచనా! ఏదైతేనేం.. చివరికీ ‘గోపాల’ చిత్రం నిర్మాతలకు, హీరోలకు మంచి ప్రాఫిట్టే తెచ్చిపెట్టింది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డేంజర్ జోన్’లోనే వున్నారని చెప్పుకుంటున్నారు. మరి.. వాళ్లంతా నష్టపోతే యూనిట్ బృందం వచ్చిన లాభాల్లో వాటిని పూరిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more