Who is special 26 movie heroine

special 26, special 26 remake, raviteja

who is special 26 movie heroine : special 26 movie remake in south confirmed in telugu with raviteja, in koliwood prasanth malayalam with dileep and in kannada it will be with darshan

ఒకేసారి నలుగురితో రొమాన్స్ చేస్తున్న నటి..?

Posted: 11/15/2014 09:30 AM IST
Who is special 26 movie heroine

ఒక సినిమాలో హీరయిన్ ఒక్కరితో లేదంటే ఇద్దరితో రొమాన్స్ చేయటం తెలిసిందే. కాని ఒకే కధలో ఏకంగా నలుగురితో అదీ ఏకకాలంలో అంటే మామూలు విషయం కాదు. ఈ చాన్స్ ఎవరికి వస్తుందో తెలియదు కానీ.., ఒక్కదెబ్బతో కోట్లు కూడబెట్టనుంది. బాలీవుడ్ లో హిట్ అయిన స్పెషల్ 26 మూవీని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు సౌత్ లోని నాలుగు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హీరోల సెలక్షన్ అయిపోయింది. ఒక్కో ఇండస్ర్టీలో ఒక్కో హీరోను ఎంపిక చేశారు. అయితే నలుగురికి కలిపి ఒకే హీరోయిన్ ఉంటుందని రీమేక్ హక్కులు దక్కించుకున్న త్యాగరాజన్ తెలిపాడు.

దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో నటించే సింగిల్ హీరోయిన్ ఎవరా...? అని చర్చ మొదలైంది. నాలుగు ఇండస్ర్టీల్లో కలిపి టాప్ ప్లేస్ లో ఉండే నటిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ లో టాప్ అంటే సమంత, శృతిహాసన్, తమన్నా ఉన్నారు. వీరు కాకుండా ఈ మద్యే వెలుగుతున్న స్టార్లు రకుల్ ప్రీత్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ తక్కువగా ఉండటంతో పెద్ద స్టార్లు చేయటానికి ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి చిన్న హీరోయిన్లకే నలుగురితో రొమాన్స్ చేసే చాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

ఇక హీరోల విషయానికి వస్తే.., తెలుగులో రవితేజతో సినిమా చేస్తున్నట్లు త్యాగరాజన్ ప్రకటించాడు. తమిళంలో ప్రశాంత్ నటిస్తాడని చెప్పాడు. మళయాలంలో దిలీప్, కన్నడలో దర్శన్ తో దీనిపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ‘స్పెషల్ 26’ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన విషయం తెలిసిందే. అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో సౌత్ రీమేక్ కోసం పోటిపడి మరి త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : special 26  special 26 remake  raviteja  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more