Rakul preet singh golden change act with pawan kalyan in gabbar singh 2 movie

rakul preet singh, rakul preet singh hot photos, rakul preet singh hot photo shoot, gabbar singh 2 movie, pawan kalyan, pawan kalyan latest movie, pawan kalyan gopala gopala movie, pawan kalyan movie updates, rakul preet singh movie updates

rakul preet singh golden change act with pawan kalyan in gabbar singh 2 movie

రకుల్ ప్రీత్ ను ‘‘గబ్బర్’’ కరునిస్తాడా..?

Posted: 10/16/2014 08:07 PM IST
Rakul preet singh golden change act with pawan kalyan in gabbar singh 2 movie

ఎప్పుడో ‘‘కెరటం’’ సినిమా ద్వారా తెలుగుచిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కు ‘‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’’ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమె వేగం మరింతగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. చిత్రపరిశ్రమకు వచ్చిన కొన్నాళ్లకే ఈ అమ్మడు అప్పుడు స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. ‘‘లౌఖ్యం’’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా సాగడంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు పెరిగిపోతూనే వున్నాయి. చిన్నసినిమాల ద్వారా టాలీవుడ్ లో తమ కెరీర్ ను పరీక్షించుకోవడానికి వచ్చిన ఎంతోమంది తారల మధ్య ఈ అమ్మడు ఒక్కతే అనతికాలంలోనే పెద్ద హీరోయిన్ల సరసన చేరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. తాజాగా ఈ అమ్మడికి ఓ బంపర్ ఆఫర్ లభించే ఛాన్స్ చాలావరకు వున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

రకుల్ ఇప్పటివరకు నటించిన చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో విజయం సాధించడంతో టాప్ డైరెక్టర్లతోపాటు స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారాలు వెలువడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాల ప్రకారం... ఈ పంజాబీ హాట్ అమ్మడు పవన్ కల్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘‘గబ్బర్ సింగ్ - 2’’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ మెండుగా వున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ సినిమా... హీరోయిన్ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ముందుకు ఇందులో హీరోయిన్ గా నటించేందుకు ఎందరో స్టార్ హీరోయిన్ల పేర్లు తెరమీదకొచ్చినప్పటికీ... ఎవరూ సెట్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు మళ్లీ సెర్చింగ్ లో పడిపోయారు. ఈ నేపథ్యంలో వారు రకుల్ ప్రీత్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు టాలీవుడ్ సమాచారం! వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అందమైన అమ్మడిని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రకుల్ ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవచ్చునని ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ అమ్మడికి గబ్బర్ పవన్ కల్యాణ్ కనుకరిస్తాడో లేదో తెలియడం లేదు. ఎందుకంటే.. ప్రస్తుత పరిమాణాలను చూస్తుంటే పవన్ రాజకీయాలమీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిన్నవచ్చిన హుధుద్ తుపాను ప్రభావంతో పవన్ రాజకీయ రంగంలో మళ్లీ అడుగులు వేయలేక తప్పలేదు. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లడంతో పవన్ ఆ సమస్యల్ని పరిష్కరించడంకోసం అటు బాబుతోపాటు మోదీకి దగ్గరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ చర్చలు ఇంకా ఎన్నాళ్లవరకు కొనసాగుతాయో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ 2 మూవీ షూటింగ్ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ‘‘గబ్బర్ సింగ్ 2’’ చిత్రం యూనిట్ అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ నవంబర్ మొదటి వారంనుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈసారి ఈ మూవీ షూటింగ్ ఖచ్చితంగా ప్రారంభం అవుతుందనే నమ్మకాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. శరత్ మరార్ తో కలిసి ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడం తథ్యమని.. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు చాలావరకు వున్నాయని టాక్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more