Chiranjeevi pawan kalyan to attend mukunda movie audio function

chiranjeevi, pawan kalyan, pawan kalyan latest news, chiranjeevi latest news, pawan kalyan chiranjeevi, mukunda movie news, mukunda audio function, mukunda movie audio release function, chiranjeevi 150 movie news, pawan kalyan gopala gopala movie news, varun tej movie news

chiranjeevi pawan kalyan to attend mukunda movie audio function : According to the mega sources.. chiranjeevi and pawan kalyan may met after a long time in the vacation of mukunda movie audio function

చిరు-పవన్ మెగా కాంబినేషన్లో మూవీ వేడుక!

Posted: 09/27/2014 08:02 PM IST
Chiranjeevi pawan kalyan to attend mukunda movie audio function

(Image source from: chiranjeevi pawan kalyan to attend mukunda movie audio function)

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల మధ్య వ్యక్తిగతంగా ఎప్పటినుంచో విభేదాలున్నాయని ఇప్పటికీ వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ఇటీవలే మెగాభిమానుల మధ్య కూడా అనుకోకుండా చీలికలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిరు, పవన్ మధ్య విభేదాలు వచ్చినట్లుగా వస్తున్న వార్తలు నిజమేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం... మెగాభిమానుల మధ్య చీలికలు వున్నట్లుగా వస్తున్న గాసిప్స్ కు చెక్ పడేలా వున్నట్లు తెలుస్తున్నాయి. చాలారోజుల తర్వాత చిరు, పవన్ లు అభిమానుల సమక్షంలో బహిరంగంగానే కలుసుకోబోతున్నారనే వార్తలు మెగావర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈసారి వీరిద్దరి కలయిక ఖాయమంటూ వాళ్లు బల్లగుద్దీ మరి చెబుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.

మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘‘ముకుంద’’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను అక్టోబర్ 4వ తేదీన ఖరారు చేసినట్లు తెలుపుతున్నారు. అయితే ఈ ఫంక్షన్ ఇదివరకెన్నడూలేని విధంగా మెగాభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫంక్షన్ కు చిరు, పవన్ కల్యాణ్ ను వాళ్లు ఆహ్వానించినట్లు తెలుపుతున్నారు. దీంతో చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ అన్నాదమ్ముళ్లు ‘‘ముకుంద’’ ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో కలుసుకోబోతున్నారని మెగావర్గాలు అంటున్నాయి. వీరితోపాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా ఈ ఆడియో ఫంక్షన్ కు విచ్చేయనున్నారని సమాచారం!

mukunda-movie-first-look

గతంలో చిరు, పవన్ లు ‘‘గబ్బర్ సింగ్’’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఒకే వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ‘‘ముకుంద’’ మూవీ షూటింగ్ ప్రారంభ నేపథ్యంలో వీరిద్దరు హాజరైనప్పటికీ.. అక్కడ కలిసి మాట్లాడినట్లుగానీ, చేతులు కలిపినట్లుగానీ, కలిసి ఫోటోలు దిగిన దాఖలాలు అయితే అస్సలు లేవు. ఆ తర్వాత రాజకీయపరంగానూ ఇద్దరూ దూరంగానే వున్నారు. అసలు వీరిద్దరూ వ్యక్తిగతంగానూ లేదా ఇతర సందర్భాల్లోనూ పర్సనల్ గా కలిసిన దాఖలాలు కూడా లేవు. మరి ఇన్నాళ్ల తర్వాత ‘‘ముకుంద’’ ఆడియో వేడుకలో ఇద్దరూ కలుసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. ఇంతవరకు ఈ విషయంపై అధికారిక ప్రకటనలూ వెలువడలేదు. ఒకవేళ చిరు, పవన్ లు ‘‘ముకుంద’’ ఆడియో ఫంక్షన్ కు హాజరయితే మాత్రం.. మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. అలాగే వారిమధ్య విభేదాలున్నట్లుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోతాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  pawan kalyan  mukunda movie  tollywood news  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more