Senior actress sridevi cried after watching marathi movie tapal

sridevi, actress sridevi, sridevi tapal movie screening, tapal marathi movie, tapal movie review, sridevi tapal movie, laxman utekar, cameraman laxman utekar, sridevi laxman utekar

senior actress sridevi cried after watching marathi movie tapal which is directed by english vinglish movie cameraman lakshman

శ్రీదేవిని ఎమోషనల్ గా ఏడిపించిన కెమెరామెన్!

Posted: 09/25/2014 08:17 PM IST
Senior actress sridevi cried after watching marathi movie tapal

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగి, తన రెమ్యునరేషన్ స్థాయిని పెంచేసి ఇక్కడి నిర్మాతలను ఏడిపించిన శ్రీదేవిని తాజాగా బాలీవుడ్ కి చెందిన ఓ కెమెరామెన్ ఆమెను ఎమోషనల్ గా బాగా ఏడిపించినట్లు సమాచారం! ఆ కెమెరామెన్ ప్రత్యేకంగా శ్రీదేవికి ఫోన్ చేసిమరీ పిలిపించిన అతగాడు.. తాను తీసిన ఒక వీడియోను ఆమెను చూపించగానే ఒక్కసారిగా ఆమె ఏడ్చేసిందట! దీంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రీదేవిని ఏడిపించిన ఆ కెమెరామెన్ ఎవరు..? అతను ఏ వీడియో చూపించి ఆమెను ఇంతలా ఏడిపించాడు..? అంటూ ఒక్కొక్కటిగా సందేహాలు బయటపడ్డాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ఆమెను అడగగా... శ్రీదేవి జరిగిన విషయాన్ని మొత్తం విశ్లేషించింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... బాలీవుడ్ లో ప్రముఖ ఛాయాగ్రాహకుడు అయిన లక్ష్మణ్ ఊటేకర్ మొట్టమొదటిసారిగా మెగాఫోన్ పట్టుకుని మరాఠీలో ‘‘తపాల్’’ అనే చిత్రాన్ని రూపొందించాడు. శుక్రవారం (26-09-2014) రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీమియర్ షోను ముంబయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతడు శ్రీదేవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాడు. గతంలో శ్రీదేవి నటించిన ‘‘ఇంగ్లీష్ వింగ్లీష్’’ చిత్రానికి లక్ష్మణ్ కెమెరామెన్ గా పనిచేయడంతో వారిమధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఆ సన్నిహిత సంబంధం వుండటం వల్లే లక్ష్మణ్, శ్రీదేవిని తన ప్రీమియర్ షోకు ఆహ్వానించాడు. అనంతరం ఆ సినిమాను చూసిన ఆమె.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయి ఏడ్చేసింది.

ఈ చిత్రం చూసిన అనంతరం మాట్లాడిన ఆమె... ఈమధ్య తాను చూసిన సినిమాలన్నింటిలోకంటే ‘‘తపాల్’’ సినిమా ఒక్కటే ఎంతగానో కదిలించిదని పేర్కొంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసల వర్షం కురిపించింది. ఉత్తరాలు కనుమరుగవుతున్న ఈరోజుల్లో.. ఓ మారుమూల గ్రామానికి, ఓ పోస్ట్ మెన్ కి మధ్య వున్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమాను లక్ష్మణ్ రూపొందించాడు. శ్రీదేవితోపాటు ఈ సినిమాను చూసిన ప్రముఖ సినీతారలు కూడా మంచిమార్కులే వేశారు. మరాఠీలో ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాను డైరెక్టర్ వ్యక్తం చేస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress sridevi  tapal marathi movie  cameraman laxman utekar  bollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more