Fight between kajal agarwal and nagababu daughter niharika

kajal agarwal, niharika, nagababu daughter niharika, kajal agarwal niharika news, kajal agarwal latest news, kajal agarwal hot photo shoot, kajal agarwal telugu movies, kajal agarwal tamil movie news, kajal agarwal kollywood, niharika latest photo shoot, nagababu niharika

fight between kajal agarwal and nagababu daughter niharika

తండ్రికోసం గొడవపడుతున్న కాజల్, నిహారిక!

Posted: 09/10/2014 11:16 AM IST
Fight between kajal agarwal and nagababu daughter niharika

ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గొడవ పడుతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు జోరుగా సాగుతున్నాయి. నిహారిక ఇంకా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చుకోలేదు కానీ.. అప్పుడే ఈ అమ్మడు కాజల్ తో దోబూచులాటకు సిద్ధమైంది. అయితే వీరిమధ్య నడుస్తున్నది సినిమాకు సంబంధించిన గొడవ కాదు... నిహారిక తండ్రి నాగబాబుకు సంబంధించి వీరిమధ్య అగ్గిరాజుకున్నట్టు తెలుస్తోంది. తమ మధ్య జరుగుతున్న ఈ వార్ విషయాన్ని స్వయంగా నిహారికయే చెప్పడం విశేషంగా మారింది. ఇటీవలే ఆలీ తాజాగా ప్రారంభించిన ఒక కార్యక్రమానికి నిహారిక పార్టిసిపేట్ గా హాజరయ్యింది. ఆ నేపథ్యంలోనే ఈ అమ్మడు తనకు, కాజల్ కు మధ్య జరుగుతున్న ఫైట్ గురించి విశదీకరించింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... గతంలో ఫ్యామిలీ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘‘చందమామ’’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే! అందులో కాజల్ తండ్రిగా నాగబాబు నటించాడు. వీరిమధ్య తండ్రికూతుళ్ల బంధాన్ని డైరెక్టర్ చాలా ప్రేమగా తెరకెక్కించాడు. పైగా వారిద్దరి మధ్య మూవీలో చూపించిన బంధానికి అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి. కానీ.. ఈ విషయం మాత్రం నిహారిక తనకు నచ్చలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో తనకెందుకు నచ్చలేదో వివరిస్తూ.. ‘‘చందమామ మూవీ షూటింగ్ లో మా నాన్న (నాగబాబు), కాజల్ ఇద్దరూ తండ్రీకూతుళ్లుగా బాగానే నటించారు. దాంతో ఆ బంధం బ్లడ్ లోకి కూడా ఎక్కిపోయింది. షూటింగ్ అయిపోయిన అనంతరం కూడా కాజల్ మా నాన్నను ‘‘నాన్న’’ అంటూ పలకరించేది. అలా పిలవడం నాకు నచ్చలేదు. అందుకే నేను కాజల్ తో.. ‘మా నాన్నను నాన్న అని పిలవకు.. అంకుల్ అని పిలువు. సినిమా షూటింగ్ తర్వాత నీకు మా నాన్నతో ఏ సంబంధమూ లేదు’’ అని ఖరాఖండీగా చెప్పేసిందట నిహారిక! ఇక అప్పటినుంచి వీరి మధ్య గొడవ మొదలైందని చెప్పుకొచ్చింది.

అయితే.. ఇంతలోనే ఆలీ సరికొత్త టాపిక్ ను తెరలేపాడు. ‘‘అంటే ఆ అమ్మాయి మీ నాన్నను ‘‘నాన్న నాన్న’’ అంటూ పిలుస్తుంటే మీ అమ్మకు మీ నాన్న మీద ఏమైనా అనుమానం వచ్చిందా’’ అంటూ సెటైర్ వేశాడు. అందుకు నిహారికా చాలా సింపుల్ గానే జవాబిచ్చింది. ‘‘లేదండి.. అది సినిమా అని మా అమ్మకు బాగా తెలుసు’’ అని చెప్పింది. అయితే ఆలీ వేసిన సెటైర్ ఇక్కడ కేవలం నాగబాబునే కాదు.. కాజల్ కు కూడా వర్తిస్తుంది. అయినా.. అక్కడ కాజల్ లేదు కాబట్టి దీనిమీద ఏ రాద్ధాంతం జరగలేదులెండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  niharika  nagababu  ali comedy show  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more