Suicide attempt rumours on producer bellamkonda suresh in media

producer bellamkonda suresh, bellamkonda suresh news, bellamkonda suresh suicide news, bellamkonda suresh suicide, suicide rumous bellamkonda suresh, alludu seenu movie, rabhasa movie, bellamkonda sai srinivas, junior ntr news, tollywood media

suicide attempt rumours on producer bellamkonda suresh in media

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నిర్మాత బెల్లంకొండ!

Posted: 09/09/2014 12:00 AM IST
Suicide attempt rumours on producer bellamkonda suresh in media

ప్రస్తుత టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఇటీవలే వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో వున్న సినీప్రముఖులందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతేకాదు.. ఆయన గతకొన్ని రోజులనుంచి అస్సలు మీడియా కంటపడలేదని, ఎక్కడికో వెళ్లిపోయారని.. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వుండవచ్చునంటూ జోరుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అసలు ఆయనకు ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పరిస్థితి ఎందుకొచ్చిందంటూ అందరికీ ఒక్కటే సందేహాలు!

ఇటీవలే బెల్లంకొండ సురేష్ తన తనయుడు సాయి శ్రీనివాస్ ని ‘‘అల్లుడుశీను’’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! ఆ సినిమా కమర్షియల్ గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అంతగా ఆదరణ పొందలేదు. దాదాపు 50 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కనీస కలెక్షన్లను కూడా రాబట్టుకోలేదు. దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ‘‘రభస’’ మూవీ పెద్ద ఫ్లాప్ గా నిలిచి ఆయన నష్టాల్ని కొనితెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలవల్ల సురేష్ దాదాపు రూ.60 కోట్లకు పైగా అప్పును మిగిల్చాయని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. దీంతోపాటు మల్టీ డైమన్షన్ సంస్థకు రూ.25 కోట్లు బాకీ పడినట్లు సమాచారం!

ఇక మొన్నటికి మొన్న మంచి లక్ష్మీ వివాదాంలో తనకు రూ.58 లక్షలు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఆమె సురేష్ పై పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే! ఇన్ని అప్పులు ఒకేసారి తన నెత్తిమీద పడటంతో తీవ్ర ఒత్తిడికి సురేష్ గురైనట్లు తెలుస్తోంది. పైగా అప్పులు ఇచ్చిన వాళ్లందరూ తమతమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా సురేష్ ను డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అతని దగ్గర డబ్బులు లేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యానికి పాల్పడ్డాడంటూ తెగ వార్తలు తిరుగుతున్నాయి. అప్పుల వల్లే నిర్మాత బెల్లంకొండ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆయన ఇంటివద్ద జరిగిన ఓ ఫంక్షన్ లో అటెండ్ అయిన ఒక నిర్మాత చెప్పిన క్రమంలో.. ఈ వార్త హల్ ల్ చేస్తోంది. దీంతో అందరికీ పెద్ద షాక్ తగిలినట్టైంది.

అయితే ఈ మరణవార్త అటూఇటూ చక్కర్లు కొడుతూ చివరికి బెల్లంకొండ సురేష్ దగ్గరికి చేరాయి. దీంతో షాక్ తిన్న సురేష్.. తనపై వస్తున్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని కొట్టిపడేశాడు. సినిమాల విషయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మామూలేనని చెప్పిన ఆయన.. తన జీవితంలో ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూశానని.. ఇప్పుడు వీటికే ఆత్మహత్య ఎలా చేసుకుంటానంటూ..?’’ ఎదురు ప్రశ్నలు వేసి అందరికి కొత్త సందేహాలను పుట్టించారు. ప్రస్తుతం ఆయన లారెన్స్ ‘‘ముని సీక్వెల్ గంగా’’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చైన్నైలో వున్నానని తెలిపిన ఆయన.. తనపై వస్తున్న పుకార్లను నమ్మోద్దంటూ విజ్ఞప్తి చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more