(Image source from: actress model mona khan suicide case new twist)
ఇటీవలే ముంబైలో అప్‌కమింగ్ హీరోయిన్ సయ్యమ్ ఖన్నా అలియాస్ మోనా ఖన్నా ‘‘తనకు సినిమాల్లో ఆఫర్లు రావడం లేదంటూ’’ ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే! అయితే ఈ కేసు విషయంలో రానురాను కొత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ద లాస్ట్ హారర్’’ అనే సినిమాలో నటిస్తున్న మోనా.. అనుకోకుండా ఇలా బలవన్మరణానికి పాల్పడటం వెనుక బలమైన కారణం ఇంకొకటి వుందంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ‘‘ద హాంటెడ్ హౌస్’’ అనే చిత్రంలోనూ నటించింది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకే రెండు ఆఫర్లు లభించినప్పటికీ.. ఈ అమ్మడు ఇలా సూసైడ్ కు ఎందుకు పాల్పడిందోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంబై యారిరోడ్డులోని ఒక ఫ్లాట్ లో వుంటున్న మోనా.. ఆదివారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఈ విషయాన్ని మోనా సోదరి రియా పోలీసులకు తెలిపింది.
డెహ్రాడూన్ లో చదువుకుంటున్న రియా.. తన సోదరి మోనాఖాన్ తో కలిసి వుందామని జూలై నెలలో ముంబైకి వచ్చింది. వారిద్దరు సదరాగా కాలాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపారు. అయితే ఆదివారం అర్థరాత్రి వరకు టీవీ చూసిన రియా.. తాను నిద్రపోవడానికి ముందు టివిని కట్ చేయగా.. మోనా గదిలోంచి పాటలు వినిపిస్తుండటంతో తాను లోనికి వెళ్లిచూసింది. అయితే అప్పటికే మోనా ఫ్యాన్ కు ఉరేసుకుందని తెలిపింది. పైగా మోనా ఒక సూసైడ్ నోట్ రాసి.. అందులో తన చావుకు ఎవరూ బాధ్యులు కారు.. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని పేర్కొంది. ఆ లేఖను తనకు మెయిల్ చేసినట్లు రియా పోలీసులకు తెలిపింది. అయితే దీనివెనుక వేరే కారణం ఏదో వుంటుందోనన్న ఆలోచనతో పోలీసులు తమదైన రీతిలో విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో రియా పోలీసులకు మోనా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. తన సోదరిని (మోనా) ఒక నటుడి కుమారుడు ప్రేమించాడని.. అయితే అతను ఎప్పుడూ ఆమెను తిట్టి, కొట్టేవాడని రియా పేర్కొంది. మోనా ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు సాయంత్రం అతడిని కలవడానికి వెళ్లిందని.. అయితే తిరిగి వచ్చేసరికి ఆమె చాలా డిప్రెషన్ లో వున్నట్లు కనిపించిందని రియా తెలిపింది. అతను ఏదో చెప్పడం వల్లే మోనా సూసైడ్ కు పాల్పడి వుంటుందని తన వాదనను పోలీసులకు తెలిపింది. వారిమధ్య తరుచూ ఏదో ఒక విషయంలో వాగ్యుద్ధం జరిగేదని.. ఆ సందర్భంలో మోనాను అతను తిట్టేవాడని.. కొన్నికొన్నిసార్లు చెయ్యి కూడా చేసుకునేవాడని పేర్కొంది. తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఇందులో ఎవరితో హస్తం వుందని అనుమానాన్ని వ్యక్తం చేసింది రియా!
రియా వాదనల ప్రకారం పోలీసులు ఆ నటుడు తనయుడు ఎవరనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అతనిని అదుపులోకి తీసుకుంటే ఈ కేసు వెనకున్న చిక్కుముడి దాదాపుగా విడిపోయే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే మోనాకు సంబంధించిన సన్నిహిత వర్గాల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. మరి మోనాఖాన్ సినిమాల్లో అవకాశాలు రాకపోవడం వల్లే సూసైడ్ చేసుకుందా..? లేదా తన ప్రేమికుడితో గొడవకు దిగి ఆత్మహత్య చేసుకుందా..? లేదా ప్రేమికుడే ఈమెకు బలవన్మరణానికి కారకుడు అయ్యాడా..? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులవరకు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more