తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుని ఓ వెలుగు వెలిగిపోయిన పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్... తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఏకంగా ‘‘బూతు’’ సినిమాకు ఓకే చెప్పేసింది. ఆమధ్య రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసి భారీ మూవీ ఆఫర్లను చేజార్చుకున్నప్పటికీ.. ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాత్రం ఇంకా తగ్గలేదు. తాను ఎంత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా.. అందుకు నిర్మాతలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాలూ వున్నాయి. అన్నిరంగాల్లోనూ కాజల్ కు మంచి పేరుంది. అయినప్పటికీ ఈ సెక్సీ భామ ఒక బూతు సినిమాను ఒప్పుకుని.. ఇప్పుడు చిక్కుల్లో పడిపోయింది. ఆ సమస్య నుంచి బయటపడటానికి నానాతంటాలు పడుతోంది.
అసలు జరిగిన విషయం ఏమిటంటే... శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడు కాజల్ అగర్వాల్ దగ్గరకు ఒక ఆఫర్ తీసుకుని వచ్చాడు. తాను తెరకెక్కించిన మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించాడు. దీంతో ఈ అమ్మడు ఆ మూవీ డీటెయిల్స్ ఏంటని తెలుసుకోకుండా వెంటనే ఓకే చెప్పేసింది. తాను వివరాలు చెప్పబోతున్నప్పటికీ ఈ అమ్మడు అవేమీ పట్టించుకోకుండా.. ఒక ఆడియో ఫంక్షన్ కు అతిథిగా అవకాశం రావడంతో పొంగిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తాను ఆడియో ఫంక్షన్ కి వస్తానని ఒప్పేసుకుంది. దీంతో సంతోషపడిన దర్శకుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఒప్పందం ప్రకారం కాలజ్ అగర్వాల్ ఆ సినిమా ఆడియో వేడుకకు హాజరయ్యింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఆ తర్వాతే ఈ అమ్మడికి అసలు విషయం బయటపడింది. తాను వచ్చింది ఒక బూతు సినిమా ఆడియోకోసమా అంటూ అవాక్కయిపోయింది. ఆ బూతు సినిమా పేరు ‘‘పిచ్చెక్కిస్తా’’!
తాను వచ్చింది ఒక బూతు సినిమా ఆడియో ఆవిష్కరణకు అని కాజల్ గ్రహించిన అనంతరం మొత్తంగానే డీలా పడిపోయింది. ‘‘అసలు ఎందుకు వచ్చాన్నాబాబు’’ అనుకుంటూ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ పెట్టేసింది. లోలోపలే టెన్షన్ పడుతున్నప్పటికీ.. బయటమాత్రం ఆ ఫీలింగ్స్ కనబడకుండా బాగానే మేనేజ్ చేసింది. పైగా.. తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా ఏమీలేదు.. అన్ని సినిమాలు ఒక్కటేనంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. నా కెరీర్ కూడా చిన్న సినిమాలనుంచే మొదలయ్యింది. అప్పట్లో నేను కూడా చాలా బెరుకుగా వుండేదాన్ని.. అటువంటి చిన్న సినిమాకు హాజరు కావడం నాకెంతో ఆనందంగా వుందంటూ భారీ డైలాగులు కూడా చెబుతోందట కాజల్! ఏదిఏమైనా.. కాజల్ ఈ ఆడియో వేడుకలో పాల్గొనడం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిపోయింది. కాజల్ లాంటి అగ్రతారలు కూడా ఇటువంటి బూతు సినిమాల ఫంక్షన్లకు హాజరవుతారా..? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన 'పిచ్చెక్కిస్తా' మూవీ ఆడియో ఆవిష్కరణలో కాజల్ అగర్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. చిత్ర దర్శకుడు ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఓ అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని వేధించి.. ప్రేమించేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌తో కుర్రాడి పరిస్థితి మారుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ మూవీ అందరినీ బాగా ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నటరాజ్, రాజశేఖర్ తెలిపారు. అదీనండి సంగతి..!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more