భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసందే. గత కొంత కాలంగా టెన్నిస్ టోర్నీల్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్న ఈ అమ్మడుకు ఎప్పటి నుండో సినిమాల్లోకి రావాలని ఉన్నా, ఆమెకు నచ్చిన అవకాశం రాకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఓ తెలుగు కుర్ర హీరో సరసన ఎంట్రీ ఇవ్వబోతుందట.
తనకు సినిమా ఇండస్ట్రీ పై ఉన్న మోజుతో ఇప్పటికే ర్యాంపుల పై క్యాట్ వాక్ లు, ఫ్యాషన్ షోల్లో పాల్గొంటున్న ఈమె సిల్వర్ స్ర్కీన్ పై బ్రేక్ డ్యాన్సులు వేసి షేక్ చేయబోతుందన్న మాట. ఇప్పటికే ఆమెను చాలామంది హీరోలు దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో చేయమని ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, సానియా మాత్రం ప్రస్తుతం తన చూపంతా టెన్నిస్ ఆటపైనే ఉందని చెబుతూ వచ్చింది.
ఆ తర్వాత పెళ్ళి చేసుకొని దుబాయ్ కి చెక్కేసిన ఈమె గత కొంత కాలంగా షోయబ్ కి దూరంగా ఇండియాలోనే ఉంటుంది. అటు పూర్తిగా మొగుడ్ని దూరం కాకుండా, ఇటు ఆట పై ద్రుష్టి పెట్టకుండా సినిమాల పై మోజు పెంచుకున్న ఈమె హీరోయిన్ గా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
ఇప్పటికే బ్యాట్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా నితిన్ సినిమా ద్వారా ఐటెం గాళ్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా వెలిగిపోదామని అనుకుంది. కానీ వెండితెర పై అడ్రస్ లేకుండా పోయింది. గుత్తాకు వచ్చిన పరిస్థితే సానియాకు రాదు కదా అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more