బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నాలుగు పదులు దాటినా ఇప్పటి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా చలామణి అవుతున్నాడు. పేరుకే బ్రహ్మచారి. మనవాడు నడిపే ప్రేమాయణాలు మాత్రం బోలెడు. ఇప్పటికి మన దేశానికి చెందిన చాలా మందితో ఎఫైర్లు నడిపిన ఈయన గత కొంతకాలంగా పరాయి దేశం రుమేనియాకి చెందిన పాప లైలా వంచర్ తో ఘాటు ప్రేమాయణం నడుపుతున్నాడు.
ఇప్పుడు ఆమెకూడా బోర్ కొట్టిందో ఏమో ఒకప్పుడు ప్రేమాయణం నడిపి, పెళ్ళికి కూడా శుభలేఖలు ముద్రించాక చివరి నిమిషంలో పెళ్లి చేసుకుండా వదిలేసిన మాజీ ప్రియురాలు సంగీతా బిజిలానీతో మళ్లీ రిలేషన్ మెయింటేన్ చేయడమే కాకుండా, ఏకాంత సాయంత్రాలు, వీలుచిక్కినప్పుడల్లా గంటలకొద్ది సొల్లేసుకుంటూ గడిపేస్తున్నారని బాలీవుడ్ జనం కోడై కూస్తున్నారు.
సల్లూ భాయ్ ని వదిలేసి మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అయిన అజహరుద్దీన్ తో ఎఫైర్ నడిపి పెళ్లి చేసుకొని గత కొంత కాలం క్రితం విడాకులు ఇచ్చిన సంగీతా అప్పటి నుండే సల్లూతో మళ్ళీ క్లోజ్ గా మూవ్ అవుతూ, ఎంతో దగ్గరి బంధువు లాగా ప్రతి చిన్న శుభకార్యానికి సల్లూ ఇంట చేరి సందడి చేస్తుందట. ప్రస్తుతం తను చేస్తున్న 'కిక్' సినిమా షూటింగ్ ముగిశాక ఇద్దరూ హాలిడే ట్రిప్ కు వెళతారని అంటున్నారు.
అసలే ఇండియాలో ఎండలు మండిపోతుంటే చల్లని ప్రదేశానికి వెళ్లి, అక్కడ ఒంట్లో వేడిని రగిలించుకొని ఎంజాయ్ చేసొచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి ఈ విషయం రుమేనియా గాళ్ ఫ్రెండ్ కి తెలిసుందంటారా ?
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more