గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ హీరోల పై ఇటీవలి కాలంలో గాలి వార్తలు జోరుగా పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరగడంతో అలాంటిదేమీ లేదని మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అల్లు అరవింద్. ఆ వార్తలకు పుల్ స్టాప్ పడిందో లేదో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై అదే రకం వార్తలు ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ప్రస్తుతం గర్భవతి అని, త్వరలో ఆమె పండంటి బాబుకు జన్మనివ్వబోతుందని, వారిద్దరికి కలిగే సంతానంతో సీనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పుట్టబోతున్నాడని నందమూరి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారట.
అంతే కాకుండా తెలుగు సినిమాకు సంబంధించిన వెబ్ మీడియాలో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చే విధంగా కొన్ని ఆధారాలు చూపుతున్నారు. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వచ్చి శ్రధ్దాంజలి ఘటించి వెళ్ళాడు. గతంలో ఇదే ఎన్టీఆర్ ఘాట్ కి భార్య లక్ష్మీ ప్రణతిని తీసుకొని వచ్చిన ఎన్టీఆర్ ఈసారి తీసుకురాకపోవడానికి ఆమె గర్బవతిగా ఉండటమే అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో తెలియాలంటే ప్రస్తుతం బిజీ షూటింగులో ఉన్న ఎన్టీఆర్ స్పందిస్తే గానీ తెలియదు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more