ప్రతి వృత్తిలోనూ ఏదో ఒక అపాయం దాగివుంటుంది. దాన్నే ఆక్యుపేషనల్ హజర్డ్ అంటారు. తాటి చెట్టు ఎక్కేవాడి ప్రాణాలు ఎప్పుడో ఒకప్పుడు దాని నుంచి పడినప్పుడు పోవచ్చనే నానుడి ఉంది. సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు, విద్యుత్ మరమ్మతు పనులలో పనిచేసేవారు నిరంతరం అపాయం నీడలోనే పనిచేస్తుంటారు.
తెర మీద హీరో గా ఎన్ని పోరాటాలు చేసినా నిజజీవితంలో వాళ్ళకీ తప్పవు అందులో ఉండే తిప్పలు. హీరో హీరోయిన్లకు ఏమైనా జరిగితే మొత్తం సినిమా నిర్మాణానికే నష్టం వాటిల్లవచ్చు కాబట్టి డూప్ విధానం వచ్చింది. కష్టమైన సాహహ దృశ్యాలను హీరో దుస్తులు ధరించి సుశిక్షితులైన స్టంట్ మాస్టర్స్ చేస్తుంటారు. వాళ్ళకీ దెబ్బలు తగులుతుంటాయి కానీ అవి వార్తలలోకి ఎక్కవు. ఎందుకంటే అక్కడ దెబ్బ తిన్నది హీరో వేషంలో ఉన్న డూప్ కనుక. కానీ కూలి షూటింగ్ లో అమితాభ్ బచ్చన్ కి దెబ్బ తగిలినప్పుడు అది సంచలనం కలిగించే వార్తయింది. ఆయనను ముంబై హాస్పిటల్ లో చేర్చినపుడు ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆయన అభిమానులు వారి వారి మతానుసారం ప్రార్ధనలు చేసారు.
తెలుగులో దివంగత ఎన్టీ రామారావుకి కూడా పూర్వకాలంలో రాజనాలతో కత్తి యుద్దం చేస్తున్నప్పుడు చెన్నై లోని సెట్ లో చేతికి దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడున్నంత సాంకేతిక ప్రగతి లేదు కాబట్టి ఆ వార్త పెద్దగా పైకి రాలేదు. కానీ ఈ మధ్యనే షారుఖ్ ఖాన్ తలకి తగిలిన దెబ్బ మళ్ళీ సంచలనాన్ని కలిగించింది. సెలబ్రిటీ కనుక, అతని మీద సినిమా నిర్మాణం ఆధారపడివుంది కనుక, సినిమా నిర్మాణంలో వృధా అయ్యే ప్రతి సమయం దాని నిర్మాణ భారాన్ని పెంచేస్తుంది కనుక.
ఈ మధ్యకాలంలో సాహసోపేతమైన సన్నివేశాలలో స్వయంగా నటించటానికి హీరోలు ఉత్సుకతను చూపిస్తున్నారు కానీ దాని వలన సినీ నిర్మాతలు ఎక్కువ నష్టపోతారు.
రామ్ లీలా సినిమాలో గర్బ డ్యాన్స్ చేసేటప్పుడు దీపికా పదుకొణె కి నడుం పట్టుకుంది. ధూమ్ 3 కోసం రోప్ డ్యాన్స్ చేస్తుంటే కత్రినా కైఫ్ కి చేతి ఎముక విరిగింది. చేతికి బ్యాండేజ్ తోనే ఆమె రొమ్ము క్యాన్సర్ కార్యక్రమంలో పాల్గొనవలసివచ్చింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమా షూటింగ్ లో హృతిక్ రోషన్ కి తలకి దెబ్బతగిలి తలలో బ్లడ్ క్లాట్ అయింది. తుపాకీ సినిమాను హిందీలో చేస్తున్న రిమేక్ లో అక్షయ్ ఖన్నా కాలు మీది నుంచి మిని ట్రక్ పోయింది. దానితో కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో ఉండవలసివచ్చింది. ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ లో సోనాక్షీ సిన్హా కాలు బెణికింది. అయినా సినీ ప్రోమో లో పాల్గొనాల్సివచ్చింది.
ఇలా వృత్తిలో జరిగే దుర్ఘటనలకు హీరో హీరోయిన్లు మినహాయింపేమీ కారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎందరో చేసిన కృషి ఫలితంగానే తయారౌతుందో సినిమా. అందులో జరిగిన తప్పులు, కలిగిన తిప్పలు ఫిల్మ్ లోకి రావు కనుక మనకు తెలియదు కానీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కున్న తర్వాతనే సినిమా అంతిమ రూపు దిద్దుకుంటుంది.
అయితే నెలల తరబడి చేసిన కృషి ఫలితం రెండున్నర గంటలు సినిమా చూసిన ప్రేక్షకులు వెల్లడించేస్తారు. చాలా బాగుందనో, పరవాలేదనో, చిఛీ చెత్త అనో న్యాయనిర్ణయం చేసేస్తారు. దానికి ముందే వెబ్ సైట్లలో రేటింగ్ వచ్చేస్తుంది. కానీ నటీనటులకు సెట్లలో నిరంతరం పరీక్షే.
శారీరకంగా జరిగే నష్టం మనకు కనిపిస్తోంది కానీ సందర్భానుగుణంగా నటించేట్పుపుడు రావలసిన ఫలితం కోసం చేసే నటనను హృదయంలో ఫీల్ అవుతూ, మెదడులో నిక్షిప్తమైవున్న అనుభవాల ద్వారా పోషిస్తున్న పాత్రకు న్యాయం చెయ్యటం కోసం జరిగే మానసిక పోరాటంలో వాళ్ళకి ఎంతో మానసిక ఒత్తిడికి కూడా గురౌతుంటారు. ఎస్వీ రంగారావు లాంటి భారీ పాత్రలను పోషించే నటులు గుండె పోటుతో మరణించారు.
శారీరకంగా మానసికంగానే కాకుండా నటీనటులకు వారి నిజజీవితంలో కూడా అనేక కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. వైవాహిక జీవితం మీద దాని ప్రభావం పడే అవకాశం ఉంది. హృతిక్ రోషన్ వైవాహిక జీవితంలో ఎదురుదెబ్బ తగిలింది. అందరినీ తలదన్నే అందంతో రాణించిన దివ్యభారతి ఆత్మహత్మ చేసుకుంది. ఇంకా ఎందరో నటీనటులు అన్ని భాషా చిత్రాలలోనూ ఏదోవిధంగా తమ నిజజీవితంలో సినిమా వలన మానసిక ఆందోళనకు గురైనవారున్నారు.
అలా శారీరకంగానూ, మానసికంగానూ, నిజజీవితంలో మానవ సంబంధాలలోనూ నష్టపోయిన సినిమా తారలు ఎందరో ఉన్నారు. అవన్నీ వారికి వారి వృత్తిపరంగా ఎదురయ్యే కష్టనష్టాలు (ప్రొఫె,నల్ హజర్డ్) గా భావించవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more