ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘1’ - నేనొక్కడినే సినిమా ప్రచార చిత్రంలో అమ్మాయిలను కించపరుస్తూ ఉన్న ఫోటో పై సమంతా చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో అందరికి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతా పై మాటల యుద్దం కూడా చేశారు. తాజాగా సమంతాకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అండగా నిలిచి మహేష్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సాటి ఆడదానికిగా సమంతా తన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. ఇలాంటి వాటి విషయంలో తొందరపడకుండా అందరు ఆలోచించాలని, ఇందులో ఎవర్ని తప్పుబట్టడానికి లేదని, ఇటు మహేష్ బాబును కానీ, చిత్ర దర్శకుడిని కానీ ఏమి అనలేమని, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ప్రచారం కోసం వివిధ మార్గాల్లో ఇదొక్కటని, అదే సమయంలో ఎవర్ని కించపరచ కుండా ఉండాలని, అమ్మాయిలను కించపరుస్తూ ఇలా చేయడం కరెక్టు కాదని, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలని అభిప్రాయ పడ్డాడు.
అయితే స్టార్ హీరోగా ఉన్న మహేష్ ఇలాంటి వివాదం చెలరేగినప్పుడు స్పందిస్తే ఇంత దూరం వచ్చేది కాదని ఆయన అభిప్రాయ పడ్డాడు. కమ్ముల అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోని కొందరు సమర్థిస్తున్న వారు ఉన్నారు. మరి సమంతా స్పందన తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు తీసుకొస్తాయో లేదో చూడాలంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more