ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ప్రజల్ని ఎలా భయపెడతాడో అందరికి తెలుసు. వర్మ సినిమాలంటే.. కొంత మంది సినీ ప్రజలు భయంతో వణికిపోతారు? అలాంటింది.. ఇప్పుడు వర్మ ప్రజలను చూసి భయపడుతున్నారు. ఎప్పుడు మీడియా వారిని ఎలా ఉపయోగించుకోవాలో వర్మకు బాగా తెలుసు. ఫ్రీ పబ్లిసిటీ కోసం వర్మ చేసే ప్రయత్నాలు అందరికి తెలిసినవే. అయితే రీసెంట్ గా రిలీజైన వర్మ మూవీ సత్య-2. ఈ సినిమా పై సెన్సార్ బోర్డు అధికారిణి పై వర్మ కేసు పెట్టి, టాలీవుడ్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అలాంటి వర్మలో కూడా భయం ఉందని రీసెంట్ గా తెలిసింది.
పవన్‌కళ్యాణ్‌కి జై! పవర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలి! అంటూ స్లోగన్స్‌ని జనాల్లోకి వదిలి తెగ ఉబలాటపడిపోయిన వర్మ అలియాస్ రామ్‌గోపాల్ వర్మ మీడియా ముందుకొస్తే చాలా గమ్మత్తుగా మాట్లాడుతారు. ఎదుటివాడి సైకాలజీనే కాన్వాసుగా మలుచుకుని తనదైన వాక్ఛతురత చూపించడం ఇతగాడికి రివాజు. మాఫియా సినిమాలో పాత్రలా నిజజీవితంలో కూడా వర్మ చాలా కాంట్రవర్శియల్‌గా ఉంటాడు. అప్పట్లో సత్య తీసి వారెవ్వా అనిపించుకున్న వర్మ లేటెస్టుగా సీక్వెల్ కథతో సత్య 2 తెరకెక్కించి యావరేజ్ అనిపించుకున్నాడు.
ఇటీవల ఒక విలేకర్ ఆశపపడి వర్మను ఒక ప్రశ్న అడగటం జరిగింది. వాళ్లని వీళ్లని రాజకీయాల్లోకి రమ్మనడం ఎందుకు? మీరే రావొచ్చుగా? అన్న విలేకరి కొంటె ప్రశ్నకు ‘ఎన్నికల్లోకొస్తే జనం తంతారు’ అని నిజాయితీగా సమాధానమిచ్చాడు. నిజమే వర్మ రాజకీయాల్లోకొచ్చి ఇలాగే సెటైరికల్‌గా మాట్లాడితే అర్థం చేసుకునేంత మంచి మనసు మన నేతల్లో లేదు. ప్రజల్లో లేదు. కాబట్టి వర్మ నిర్ణయం సరైనదే. ఎన్ని సంవత్సరాలకు వర్మ నిజం చెప్పాడని టాలీవుడ్ లోని కొంతమంది వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడేప్పుడో పంజాగుట్ట, విడియో ల్యాబ్ నడిపేటప్పడు నిజం చెప్పాడు.. మళ్లీ ఇప్పుడు చెప్పాడని వర్మ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. వర్మ కు పంజాగుట్ట అటే చాలా ఇష్టమాని చెబుతున్నారు. ఆయన దర్శకుడు కాకముందే.. పంజాగుట్ట సెంటర్ తో వర్మకు చాలా అనుబంధం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏమైన వర్మ ఈజ్ గ్రేట్ అని టాలీవుడ్ లోని కొంతమంది నిర్మాతలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more