Gopala gopala movie has no audio release

Gopala Gopala movie, Gopala Gopala songs, Gopala Gopala audio release date, Gopala Gopala no audio release, Gopala Gopala direct audio release, Gopala Gopala latest photos, Gopala Gopala latest, Gopala Gopala posters, Gopala Gopala wallpapers, Gopala Gopala pawan kalyan latest look, Gopala Gopala venkatest photos, Gopala Gopala release date, Gopala Gopala cast and crew, pawan kalyan latest, upcoming telugu movies

no audio release for Gopala Gopala movie : As per filmnagar gossips Gopala Gopala movie will have no audio release function. Because of short time Gopala Gopala songs will relased directly into market. pawan kalyan venkatesh working hard for completing Gopala Gopala in time. Gopala Gopala plans to release on 14th january or on 09th january of 2015

పవన్ కు టైం లేదు.., ఫ్యాన్స్ కు ఆ భాగ్యం లేదు

Posted: 12/28/2014 11:52 AM IST
Gopala gopala movie has no audio release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా సంక్రాంతి కోసం సిద్దమవుతోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పండగకు థియేటర్లలో  సినిమా ఉంటుందని మూవీ యూనిట్ చెప్తోంది. మిగిలి ఉన్న షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని వచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. సినిమా విడుదలయ్యే లోపు ఫ్యాన్స్ ఆారాటం తీర్చేందుకు ప్రయత్నాలు చేయటం లేదని తెలుస్తోంది. గత  నెలలో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత ఫోటోలు వచ్చాయి. ఇవన్నీ బాగా ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు పెంచుకున్న ఫ్యాన్స్ మూవి విడుదలకు ముందుండే ఆడియో రిలీజ్  కోసం ఎదురుచూస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ ఇంతగా ఎదురుచూస్తున్న ఆడియో రిలీజ్ అదృష్టం వారికి ఉండదని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఫంక్షన్ పెట్టి పాటలు విడుదల చేయకుండా..., నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ఇందుకు కారణం.., సమయం లేకపోవటమే అని అంటున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న పదిహేను రోజుల సమయంలో సినిమా షూటింగ్ పూర్తవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగాలి. ఇవన్నీ పూర్తయ్యాక సెన్సార్ కు వెళ్లాలి. కాబట్టి ఆడియో రిలీజ్ చేసే సమయం ఉండదని భావించి డైరెక్ట్ ఎయిర్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

ఫిలింనగర్ నుంచి వస్తున్న ఈ ఊహాగానాలు ఫ్యాన్స్ ను నిరాశలోకి నెడుతున్నాయి. ఆడియో రిలీజ్ ఉంటుందని.., పవర్ స్టార్ ను డైరెక్ట్ గా చూడొచ్చని ఆశపడ్డ అభిమానులు తమకు ఆ భాగ్యం లేదని బాధపడుతున్నారు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్పందన రావటంతో పాటలన్నీ బాగుంటాయని టాక్ విన్పిస్తోంది. కథకు అధిక ప్రాధాన్యం ఉన్నందున ‘గోపాల గోపాల’లో కేవలం మూడు పాటలే ఉన్నాయట. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు హైలైట్ అవుతాయని టాక్ వస్తోంది. ఈ మద్య అనూప్ సంగీతం అందించిన ఇతర సినిమాల పాటలు బాగా పాపులర్ కావటమే ఇందుకు కారణం. ఆడియో రిలీజ్ ఎలాగూ లేదని దాదాపు కన్ఫర్మ్ అయినట్లే.., కనీసం సినిమా అయినా ఏ ఇబ్బందులు లేకుండా పండగకు సందడి చేయాలని ఆశిద్దాం.



కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  pawan kalyan latest  tollywood latest  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more