దంతక్షతాలు, నఖక్షతాలు- పళ్ళతోను, గోళ్ళతోనూ గాట్లు పెట్టటం భాగస్వామిని రెచ్చగొట్టేందుకు ఉపయోగపడుతుందని శృంగార కోవిదులు చెప్తారు. అయితే వాటిని అత్యాచారానికి నిలువరించటానికి కూడా పనికివస్తాయని ఆ సమయంలో గుర్తుపెట్టుకోవటం అరుదైన విషయం. సామాన్యంగా బలాత్కారాలలో పురుషుడి బలాన్ని చూసి మహిళలు భయాందోళనకు లోనై మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, మనస్తాపానికి గురై ఏమీ చెయ్యలేక నిర్బలులవుతారు.
కానీ బ్యూటీ పార్లల్ లో పనిచేసే 18 సంవత్సరాల మహిళ తనను గట్టిగా పట్టుకుని బలవంతంగా దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటున్న మనిషి నాలికను కటుక్కున కొరికింది. భోపాల్ లో కమలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో ఇరువురూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. తప్పని సరి పరిస్థితుల్లో తప్పించుకోవటానికి మార్గం లేక నాలిక కొరికానంటుంది ఆమె. అంతేకాదు, ఎప్పుడైనా ఎవరైనా బలవంతం చెయ్యబోతే భయపడకుండా ఇలాంటి పనిచెయ్యండని ఆమె ఇతర అమ్మాయిలకు చెప్తోంది. అతను కొద్దికాలంగా తనను ఊరికే తేరిపార చూస్తున్నాడని ఆమె గుర్తు చేసుకుంది కూడా.
అయితే నిందితుడైన 30 సంవత్సరాల ఆ యువకుడు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయితో తనకు సంబంధం ఉందని, రతిబాద్ లో ఉండే తను సోమవారం భోపాల్ కి వచ్చానని, ఆ రాత్రి ఆ అమ్మాయి ఫోన్ చేసి పిలిస్తేనే తను కమలానగర్ కి వెళ్ళానని అక్కడ ఈ సంఘటన చోటుచేసుకుందని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి అదంతా కట్టుకధని కొట్టిపారేసింది.
పైగా 18 సంవత్సరాల అమ్మాయితో నాలుగు సంవత్సరాలుగా సంబంధం ఉండటమనేది నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడుతున్నారు చాలామంది. నాలుగు సంవత్సరాల క్రితం ఆమెకు 14 సంవత్సరాలు, అతనికి 26 సంవత్సరాలు కాబట్టి వారిద్దరి మధ్యా అప్పటి నుంచే ప్రేమాయణం సాగటం అవాస్తవమని అంటున్నారు.
ఏది ఏమైనా, తప్పు చేసి నాలిక కొరుక్కునే అవకాశం లేకుండా చేసిందా అమ్మాయి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more