Mahesh 1 nenokkadine failure

Mahesh 1 Nenokkadine failure, Director Sukumar, Superstar Mahesh Babu, Telugu movie 1, 1 Nenokkadine

Mahesh 1 Nenokkadine failure

మహేష్ 1 లో పాతచింతకాయ పచ్చడి లోపం

Posted: 01/16/2014 11:56 AM IST
Mahesh 1 nenokkadine failure

పిక్నిక్ కి వెళ్ళినా వేడుకలకు హాజరైనా అక్కడ కూడా తెలిసిన ముఖాలకోసమే వెతుక్కోవటం పరిపాటి.  అంతే కాదు ఆ వంకన తెలిసినవాళ్ళని కలవవచ్చని కూడా కొందరి ఆశ.  అంతేకానీ కొత్తవాళ్ళతో పరిచయం చేసుకుందాం, అవిధంగా తన సర్కిల్ ని పెంచుకుందాం అని అనుకునేవారు అరుదుగా కనిపిస్తారు.  అన్నిటికంటే ముఖ్యంగా ఏ వేడుకకోసమైతే అక్కడ కూడారో దాని సంగతి పక్కకు పెట్టి మిగతా కబుర్లలో పడేవారు కూడా అధికశాతంలోనే కనిపిస్తారు.

కానీ సినిమాకి పోయి కూడా పాత కథనాలకోసమే చూసేవారికోసమే పుట్టిందేమో- పండుగనాడు కూడా పాత మొగుడేనా అన్న సామెత లేక పాతచింతకాయ పచ్చడి అనే వ్యావహారిక పదాలు.

మహేష్ బాబు నటించిన 1, నేనొక్కడినే మీద వివిధ వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు వార్తల్లో వస్తున్నాయి.  అందుకు కారణం కథలోని కొత్తదనం, పాత్రలు తక్కువగా ఉండటం, వినోదం పాలు తక్కువుండటం, సీరియస్ గా దర్శకుడు తన కధని చెప్పుకుపోవటం, అదేమో మేధస్సుని సవాల్ చేసే కథ అవటం.

మన ప్రేక్షకులు తెలియని హీరోల విషయంలో భిన్నమైన కథని, సీరియస్ గా ఉండే విషయాలను అంగీకరిస్తారు.  కానీ తెలిసిన హీరో, సూపర్ స్టార్ ముద్రవేసుకున్న హీరో విషయంలో ఒక చట్రంలో బిగించి అందులోనే చూడదలచుకుంటారు.  మానసిక శాస్త్రంతో సంబంధమున్న అపరిచితుడు, గజని, చంద్రముఖి లాంటి సినిమాలు

ఆదరణను పొందాయంటే కథలో వినోదానికి కూడా సమానంగా భాగమివ్వటమే కారణం.  
అదే వేరే భాషలోని చిత్రమైతే ఇంగ్లీష్ కానీ హిందీ చిత్రాలలో పూర్తిగా కథకే ప్రాధాన్యతనిచ్చినవి జనాదరణ పొందినవి కూడా చాలా ఉన్నాయి.  పూర్తి యాక్షన్ సినిమాలు- ట్రాన్స్ పోర్టర్, ఓషన్స్, బోర్న్ ఐడెండిటీ సిరీస్ కూడా ఆదరణకు నోచుకున్నాయి.  కానీ తెలుగులోకి వచ్చేసరికి మనకో చిక్కని కథతో పాటు సెంటిమెంట్, దానితో పాటు కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు కావాలి.  ఇక ఫ్యాన్స్ దండిగా ఉన్న స్టార్ నటించిన సినిమాకి వచ్చేసరికి అవన్నీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండాలి.

అక్కడే దెబ్బతిన్నది మహేష్ 1, నేనొక్కడినే సినిమా.  రొమాన్స్, స్టంట్స్, సరికొత్త కథ ఉంది బాగానే ఉంది, నంజుకోవటానికి ఆవకాయ లా ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది చాలా సంతోషం కానీ వినోదమేది.  బ్రహ్మానందం ఎక్కడ, అలీ కానీ, ఎమ్ ఎస్ నారాయణ కానీ లేరే.  దూకుడు, బిజినెస్ మన్ రాణించాయంటే ముక్కుకు సూటిగా కథను చెప్పకుండా మధ్యలో కథలో భాగంగా నవ్వించే ప్రయత్నం చెయ్యటమే.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more