టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ స్టార్ హీరోనా కాదా ? ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఫిలింనగర్ అయ్యింది. సాధారణంగానైతే అల్లు అర్జున్ ని స్టార్ హీరోగానే పరిగణిస్తారు దర్శకులు. అతను చేసిన కొన్ని సినిమాలు అయినా మంచి యాక్టర్ గా, డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇతను స్టార్ హీరో కాబట్టే ఇతని సినిమాలను పెద్ద బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తారు.. ఈ మధ్యన రిలీజ్ అయిన జులాయి సినిమా కూడా 40 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ఒక స్టార్ హీరో కాబట్టే ఇన్ని వసూళ్ళు చేసింది. మరి ఇంకేటి గొడవ అనుకుంటున్నారా ? అదేం లేదండీ... టాలీవుడ్ లో తీసిన రెండు చిత్రాలతో అయినా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్ ) మాత్రం అల్లు అర్జున్ స్టార్ హీరో కాదని అన్నాడు.
తాను ప్రస్తుతం దగ్గుబాటి రాణాతో క్రిష్ణ వందే జగద్గురుమ్ అనే సోషియో ఫాంటసీ సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదల అయింది. ఈ ఆడియో వేడుకలో క్రిష్ అన్నీ తానై వ్యవహరించాడు.. ఈ ఆడియోలో మాట్లాడుతూ... తనకు మల్టీస్టారర్ చిత్రాలు తీయాలని ఉందని... కానీ ఇంత వరకు నాకు మల్టీస్టార్లు దొరకలేదని... అందుకే నేను అల్లరి నరేష్, శర్వానంద్ లతో గమ్యం, మంచు మనోచ్,. అల్లు అర్జున్ లాంటి చిన్న స్టార్లతో తీశానని అన్నాడు. అంటే క్రిష్ అంచనా ప్రకారం స్టార్ హీరోలంటే... వెంకటేష్ , నాగార్జునలేనా ? ఇప్పుడు వచ్చిన అల్లు అర్జున్ స్టార్ హీరో కాదా ? ఏంటి అతని ఉద్దేశ్యం. ఈ విషయం విన్న అల్లు మాత్రం చాలా ఫీలయ్యాడని, ఈయన ఇలాంటి వాడని తెలిస్తే నేను వేదం సినిమాలో నటించేవాణ్ని కాదని తన సన్నిహితులతో అంటున్నాడట. ఏది ఏమైనా క్రిష్ మాత్రం అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాడని అంటున్నారు సినీజనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more