నందమూరి నట సింహం బాలక్రిష్ణ త్వరలో ఓ మైలు రాయిని అందుకో బోతున్నాడు. అదేంటంటే వంద చిత్రాలు పూర్తి చేసిన నటుల జాబితాలో చేరబోతున్నాడు. ప్రస్తుతం బాలక్రిష్ణ నటిస్తున్న ‘‘శ్రీమన్నారాయణ’’ తన 97 వ చిత్రం. దీని తరువాత గతంలో బాలక్రిష్ణ నటించిన ‘‘ఆదిత్య 369’’ చిత్రానికి సీక్వెల్ గా ‘‘ఆదిత్య 999’’ సినిమాని సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేయబోతున్నాడు. తన 99వ సినిమాని 2013 సంవత్సరం ప్రారంభంలో ప్రారంభం అవుతుందని సమాచారం. తదుపతి తన వందో ఆ సంవత్సరం చివరిలో ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే బాలక్రిష్ణ వందో సినిమా ని ఎవరు డైరెక్ట్ చేయబొతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి నుండే దీని పై చర్చలు ప్రారంభించారు. బాలక్రిష్ణ అయితే పౌరాణిక సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కెరీర్ లో ఓ మైలురాయిగా సినిమా నిలవాలంటే...భక్తిరస చిత్రం అయితేనే బాగుంటుందని బాలక్రిష్ణ ఆలోచన అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి వందో సినిమాకి దర్శకుడు ఎవరు ? గతంలో బాలక్రిష్ణకి హిట్ సినిమా అందించిన రాఘదేంద్ర రావు లేక బాపు లాంటి దర్శకులు దర్శకత్వం వహిస్తారా లేక ? యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు ఈ లిస్టులోకి వస్తారా అనేది చూడాలి.
మొత్తానికి బాలక్రిష్ణ సెంచరీని 2014 ఎన్నికల లోపు పూర్తి చేసి తరువాత రాజకీయాలలో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. అందుకే తొందరగా సినిమాలు చేయాలని తొందర పడుతున్నట్లు కూడా సమాచారం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more