సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో చేసే స్టైల్ కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే. అయితే రజినీకాంత్ నిజ జీవితంలో కూడా ఓ స్టైల్ లాంటి మ్యాజిక్ చేశాడు. అదేంటంటే... ఆయన ఈ మధ్యనే ప్రారంభించినా ఓ వెబ్ సైట్ ఇంటర్ నెట్ లేకుండానే యాక్సెస్ అవుతుంది. అదేంటి విచింత్రంగా ఉందని ఆలోచించకుండా ఈ కింది మేటర్ ని చదవి తెలుసుకోండి.
ఏదైనా వెబ్‌సైట్‌కు యాక్సెస్ కావాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాల్సిందే. రజనీకాంత్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ కావాలంటే మాత్రం ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయాల్సిందే. ఇంటర్నెట్‌కు డిస్‌కనెక్ట్ అయితే రజనీ వెబ్‌సైట్ ఎలా పని చేస్తుందని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అటు ‘బాబా’ అనుగ్రహం, ఇటు ‘రోబో’ శక్తి సామర్థ్యాలు గల రజనీకి ఇదో లెక్కనా అంటూ వెబ్ నిపుణులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అల్ అబౌట్ రజనీ పేరిట గల ఈ వెబ్‌సైట్‌ను వీక్షించాలంటే, ఆరంభంలో ఒక్కసారి మాత్రమే ఈ వెబ్‌సైట్‌కు ఇంటర్నెట్‌తరువాత యాక్సెస్ కావాలి. ఆ తరువాత నెట్‌కు డిస్‌కనెక్ట్ అయితేనే ఈ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
దీని వెనుక ఏ మహత్తర శక్తి లేదు.ఉన్నదల్లా సింపుల్ లాజిక్ మాత్రమే. తొలిసారిగా ఈ వెబ్‌సైట్‌కు యాక్సెస్ కాగానే ఫ్లాష్ ఫైల్‌గా ఉండే వెబ్‌సైట్ మొత్తం మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. ఆ తరువాత మీరు నెట్‌కు డిస్‌కనెక్ట్ కావాలి. అలా డిస్‌కనెక్ట్ అయ్యారో లేదో ఈ ఫ్లాష్ ఫైల్ తనిఖీ చేస్తుంటుంది. మీరు గనుక పొరపాటు మళ్ళీ ఇంటర్నెట్‌కు యాక్సెస్ అయితే మాత్రం ఈ వెబ్‌సైట్‌ను తిరిగి వీక్షించలేరు. మరింకెందుకు ఆలస్యం...వెంటన్ ఆల్ అబౌట్ రజనీ వెబ్‌సైట్‌ను చూడండి మరి... ఒకసారి కనెక్ట్ కాగానే ఇంటర్నెట్‌కు డిస్‌కనెక్ట్ కావడం మర్చిపోవద్దు సుమా... మీ అభిమాన నటుడికి, మీకు మధ్య ఇంటర్నెట్ మాత్రం ఎందుకు?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more