Akhanda Movie Review Rating Story Cast and Crew ‘అఖండ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘అఖండ’ ‘అఖండ’ Get information about Akhanda Telugu Movie Review, Balakrishna Akhanda Movie Review, Akhanda Movie Review and Rating, Akhanda Review, Akhanda Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 96594 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘అఖండ’

  • బ్యానర్  :

    ద్వారక క్రియేషన్స్

  • దర్శకుడు  :

    ద్వారక క్రియేషన్స్

  • నిర్మాత  :

    మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

  • సంగీతం  :

    త‌మ‌న్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    సి.రామ్ ప్రసాద్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజు

  • నటినటులు  :

    నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్‌, శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ, కాలకేయ ప్రభాకర్, సుబ్బరాజు, అవినాష్‌, సాయికుమార్‌, శ్రవ‌ణ్ తదితరులు

Akhanda Movie Review Balakrishna And Pragya Jaiswal S Film Is High On Masala

విడుదల తేది :

2021-12-02

Cinema Story

మాస్‌ పల్స్‌ పట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్ అడియన్స్ తన బలం అని నమ్మే బాలయ్యకు తోడైతే.. ఆ చిత్రాలు భారీ బంఫర్ మాస్ హిట్లేనని ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాలు మనకు నిరూపించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమే అఖండ. కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత థియేటర్‌లో విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో కూడా భారీ అంచనాలకు కారణమైంది. భారీ ఎలివేషన్స్‌, రోమాంచితమైన యాక్షన్‌ ఘట్టాలతో నందమూరి బాలయ్యను అభిమానులు కోరుకున్న విధంగా ప్రజెంట్‌ చేసిన.. బోయపాటి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నట్లేనా.? ‘అఖండ’ అంచనాల్ని అందుకుందా?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

అనంతపురం నేపథ్యంలో నడిచే కథ ఇది. సేవాభావంతో పాటు ఆదర్శగుణాలు కలిగిన మురళీకృష్ణ (బాలకృష్ణ) ప్రజల కష్టాల్లో తోడూనీడగా ఉంటాడు. తన ఉళ్లో పెద్ద ఆసుపత్రిని కట్టించి ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంటాడు. ఆ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన శరణ్య (ప్రగ్యాజైస్వాల్‌)…మురళీకృష్ణ మంచితనాన్ని నచ్చి ఆయన్ని ఇష్టపడుతుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. అత్యంత క్రూరుడైన వరదరాజులు (శ్రీకాంత్‌) అక్రమ మైనింగ్‌ చేస్తూ తనకు ఎదురు తిరిగిన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు.

యురేనియం తవ్వకాల్ని జరుపుతూ ఆ ప్రక్రియలో వచ్చే ఉద్గారాలను రివర్స్‌ పంపింగ్‌ ద్వారా భూమిలోకి పంపిస్తుంటాడు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతుంటారు. తన అన్యాయాల్ని ప్రశ్నించిన మురళీకృష్ణపై వరదరాజులు పగ పెంచుకుంటాడు. ఆసుపత్రిలో బాంబ్‌బ్లాస్ట్‌ కుట్ర పన్ని మురళీకృష్ణను జైలుకు పంపిస్తాడు. అంతటితో ఆగకుండా మురళీకృష్ణ కుటుంబాన్ని అంతమొందించే ప్రయత్నం చేస్తాడు? అప్పుడు అఖండ (బాలకృష్ణ) ఒక్కసారిగా తెరమీదికొచ్చి మురళీకృష్ణ కుటుంబానికి రక్షకుడిగా నిలుస్తాడు. అసలు అఖండ పూర్వాపరాలు ఏమిటి? మురళీకృష్ణతో అతనికున్న సంబంధమేమిటి? వరదరాజులు మాఫియా నెట్‌వర్క్‌ లోతులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

cinima-reviews
‘అఖండ’

విశ్లేషణ

మాస్‌ అంశాలతో పాటు శివుడికి సంబంధమైన దైవిక అంశాల్ని కలబోసి దర్శకుడు బోయపాటి ఈ సినిమా కథ రాసుకున్నారు. మాస్‌ ఎలిమెంట్స్‌ను అత్యంత ప్రభావశీలంగా, ప్రేక్షకుల్లో ఓ ఊపు తీసుకొచ్చే విధంగా ఆవిష్కరించడంలో బోయపాటి దిట్ట. ఈ సినిమాలో కూడా అవే అంశాలపై దృష్టిపెట్టాడు. సినిమా ఆద్యంతం హీరో ఎలివేషన్స్‌, రొమాంచితమైన యాక్షన్‌ సీన్లకే ప్రాధాన్యతనిచ్చాడు. ఆరంభ సన్నివేశాల్లో మురళీకృష్ణ ప్రజాసేవ, కలెక్టర్‌ శరణ్యతో అతని ప్రేమ.. పెళ్లికి దారితీసే ఎపిసోడ్‌తో ఆకట్టుకుంది. వరదరాజులుతో మురళీకృష్ణ వైరంతో సినిమా పూర్తిగా యాక్షన్‌ బాటపట్టింది.

మురళీ కృష్ణ కుటుంబాన్ని అంతం చేయాలన్న వరదరాజులు పథకాన్ని అడ్డుకునే నేపథ్యంలో అఖండ ప్రవేశం ఉత్కంఠను పంచుతుంది. ప్రీ ఇంటర్వెల్‌లో అఖండ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ ఎపిసోడ్‌లో కావాల్సినంత యాక్షన్‌ పండింది. సినిమాలోని ఆ బ్లాక్‌ను బాలయ్య అభిమానులకు ఓ విజువల్‌ ఫీస్ట్‌లా చెప్పుకోవచ్చు. తనమార్క్‌ పతాకస్థాయి ఉద్వేగాలు, రొమాంచితమైన ఎలివేషన్స్‌తో అఖండ ఎంట్రీ ఎపిసోడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు బోయపాటి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ద్వితీయార్థం ఎలా ఉంటుందోననే ఉత్సుకతను పెంచుతుంది.

ఇక ద్వితీయార్థంలో కథ మొత్తాన్ని అఖండ చుట్టే నడిపించారు. అఖండ అడుగేస్తే పోరాటం, శత్రు సంహారం అన్న చందంగా సెకండాఫ్‌ సాగింది. ఏ మాత్రం విరామం లేని యాక్షన్‌ వల్ల మధ్యలో సన్నివేశాలుంటే బాగుండనే భావన కలగడం ఖాయం. అఖండ పాత్రను దైవాంశ సంభూతుడిలా ఆవిష్కరించారు బోయపాటి. ఆ పాత్ర ద్వారానే శివతత్వం, హిందు ధార్మిక అంశాల్ని చెప్పే ప్రయత్నం చేశారు. అఖండ చెప్పే సంభాషణలకు కొదువలేకుండా పోయింది. అవి బాగున్నాయి కూడా. సెకండాఫ్‌లో మురళీకృష్ణ పాత్రకు తక్కువ స్పేస్‌ ఇచ్చారు. ద్వితీయార్థం పూర్తిగా యాక్షన్ పార్ట్ గా మారింది. ఫ్యామిలీ డ్రామాకు చోటు కల్పించాల్సింది. ఇక క్లెమాక్స్‌ ఘట్టాలు, ముగింపు ఊహించినట్లుగానే సాగాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

మురళీకృష్ణ, అఖండ అలియాస్ శివుడిగా రెండు పాత్రల్లో బాలకృష్ణ తనదైన సహజ అభినయంతో మెప్పించారు. మురళీకృష్ణ పాత్రలో చక్కటి హుందాతనం కనిపించింది. అలాంటి పాత్రలు ఆయనకు టైలర్‌మేడ్‌లా అనిపిస్తాయి. అఖండగా మాత్రం బాలకృష్ణ అదరగొట్టాడనే చెప్పాలి. అద్భుతమైన గెటప్‌తో పాటు ఏకధాటిగా, అనర్గళంగా చెప్పిన సంభాషణలతో తన స్టామినా ఏమిటో చెప్పారు. ప్రగ్యాజైస్వాల్‌ గ్లామర్‌కే పరిమితమైపోయింది. అక్కడక్కడా అభినయంతో కూడా ఆకట్టుకుంది. ప్రతినాయకుడు వరదరాజులు పాత్రలో శ్రీకాంత్‌ అంతగా సూటవలేదనిపించింది. అంచనాలకు తగినట్లుగా విలనీ ప్రదర్శించలేకపోయారాయన. జగపతిబాబు పాత్ర చిత్రణ మెప్పిస్తుంది. పూర్ణకు అభినయప్రధానమైన పాత్ర దొరికింది. తక్కువ స్క్రీన్‌స్పేస్‌ ఉన్నా మెప్పించింది. సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి. వారంతా పరిధుల మేరకు నటించారు.



టెక్నికల్ అంశాలకు వస్తే..

ఇక సాంకేతికంగా ప్రతి విభాగంలో ఉన్నతమైన విలువలు కనిపించాయి. పోరాటఘట్టాలకు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి మార్కులు పడతాయి. సినిమాలో ఎమోషనల్‌ ఫీల్‌ను తమన్‌ బీజీఎమ్‌ చక్కగా ఒడిసిపట్టింది. రాంప్రసాద్‌ కెమెరా పనితనం బాగుంది. ముందే చెప్పినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన యాక్షన్‌, ఎలివేషన్స్‌ను నమ్ముకొని సినిమా చేశాడు. కొంచెం యాక్షన్‌ డోస్‌ తగ్గించి కథలోని ఎమోషన్స్‌పై దృష్టిపెడితే సినిమా మరింత బాగుండేది.

అయితే ఆయన శైలి మాటలు మాత్రం మెరిశాయి. నిర్మాణ విలువలు బాగా కుదిరాయి. ఖర్చుకు ఎక్కడా వెనుకాడినట్లు కనిపించలేదు. ‘అఖండ’ ప్రథమార్థమంతా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఆకట్టుకుంది. సెకండాఫ్‌లోనే కాస్త పట్టుతప్పింది. అయితే కావాల్సినంత యాక్షన్‌, ఎలివేషన్స్‌తో ఫ్యాన్స్‌కు మాత్రం ఓ పండగలా అనిపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.  

తీర్పు:  యాక్షన్ డోస్ ఎక్కువైనా.. ఓవరాల్ గా బాలయ్య-బోయపాటీల కాంబినేషన్ ‘అఖండం’

చివరగా.. బాలయ్య మాస్ నటన ‘అఖండం’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh