Venky Mama Movie Review Rating Story Cast and Crew ‘వెంకీ మామ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘వెంకీ మామ’ ‘వెంకీ మామ’ Get information about Venky Mama Telugu Movie Review, Victory Venkatesh, Naga Chaitanya Venky Mama Movie Review, Venky Mama Movie Review and Rating, Venky Mama Review, Venky Mama Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 91884 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘వెంకీ మామ’

 • బ్యానర్  :

  సురేష్ ప్రోడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

 • దర్శకుడు  :

  కె.ఎస్. రవీంద్ర (బాబీ)

 • నిర్మాత  :

  సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌

 • సంగీతం  :

  త‌మ‌న్‌

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  ప్రసాద్ మూరెళ్ల

 • ఎడిటర్  :

  ప‌్రవీణ్ పూడి

 • నటినటులు  :

  వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, ప్రకాశ్‌రాజ్‌, రావు ర‌మేశ్‌, హైప‌ర్ ఆది, చ‌మ్మక్ చంద్ర, త‌దిత‌రులు

Venky Mama Movie Review

విడుదల తేది :

2019-12-13

Cinema Story

తన కుటుంబ హీరోలందరితో కలసి ఒక చిత్రాన్ని రూపోందించాలన్న అగ్రనిర్మాత రామానాయుడి కళ ఇవాళ నెరవేరింది. మామఅల్లుళ్లుగా, మల్టీస్టార్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందకు వచ్చింది. నిజజీవితంలోనూ మామాఅల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్, నాగచైతన్యలు కలసి తెరను పంచుకోవడం ఇదే తొలిసారి. వెంకటేష్ సినీమాలు అనగానే మినిమమ్ గ్యారంటీగా చిత్రాలుగా ప్రేక్షకుల్లో గ్యారంటీ వుంది. ఆయన చిత్రాలను చూసేందుకు వెళ్లిన ప్రేక్షకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురికాడన్నది సత్యం.

అలాంటిది తన అల్లుడితో కలసి చేసిన చిత్రంలో ప్రేక్షకుడిని ఇంకెంత అలరిస్తాడో.. తన అల్లుడిని ఎలా ముందుకునడిపిస్తాడోనన్న అంచనాల నేపథ్యంలో మామాఅల్లుళ్ల సందడి ఎలా సాగింది అంటే.. జాతకాలపై వున్న నమ్మకాలు గోప్పవా.? లేక మనిషికి మనిషికి మధ్యనుండే ప్రేమానుబంధాలు గొప్పవా అన్న ప్రశ్న వస్తే.. ఎవర్వైనా ప్రేమానుబంధాలకే మొగ్గుతారన్నది కాదనలేని వాస్తవం. అదే లైన్ తీసుకుని దర్శకుడు బాబి మామా అల్లుళ్ల మధ్య ఓ చక్కని కథ అల్లేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇక చిత్ర కథలోకి ఎంట్రీ ఇస్తే..

వెంక‌ట‌ర‌త్నం నాయుడు అలియాస్ మిల‌ట్రీ నాయుడు (వెంక‌టేష్‌) అంటే ఆ ఊళ్లో  ప్రత్యేక‌మైన గౌర‌వం. ఆయ‌నకి మేన‌ల్లుడు కార్తీక్(నాగ‌చైత‌న్య‌) అంటే ప్రాణం. అమ్మానాన్నలు చిన్నప్పుడే చ‌నిపోవ‌డంతో కార్తీక్‌కి అన్నీ తానై పెంచుతాడు మామ వెంక‌ట‌ర‌త్నం నాయుడు. నాయుడు తండ్రి రామనారాయ‌ణ(నాజ‌ర్‌) జాత‌కాల్లో ఆరితేరిన‌వాడు. కార్తీక్ జాతకం వ‌ల్ల నాయుడు ప్రాణాల‌కి ముప్పు ఉంద‌ని గ్రహిస్తాడు. కార్తీక్ నీడ కూడా మ‌న ఇంటి మీద ప‌డ‌కూడ‌దంటాడు రామ నారాయ‌ణ‌. కానీ తన తండ్రి చెప్పినవేవీ ప‌ట్టించుకోకుండా త‌న మేన‌ల్లుడికి అండ‌గా నిలుస్తాడు నాయుడు.

ఎప్పుడూ త‌న మామ‌తో పాటే ఉండే కార్తీక్ ఆయ‌న‌కి చెప్పకుండా వెళ్లిపోతాడు. మిల‌ట‌రీలోకి వెళ్లాడ‌ని తెలుసుకున్న వెంక‌ట‌ర‌త్నం.. త‌న అల్లుడిని వెదుక్కుంటూ వెళ‌తాడు. ఆ క్రమంలో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో ఆయ‌న‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. కార్తీక్ ఎందుకు మిల‌ట‌రీలోకి వెళ్లాల్సి వ‌చ్చింది? వెన్నెల(పాయ‌ల్ రాజ్‌ఫుత్‌), హారిక(రాశీఖ‌న్నా) ఎవ‌రు? వాళ్లకు హీరోలతో ఎలా పరిచయం.? ఆర్మీ నుంచి కార్తీక్ మళ్లి తన మామ కోసం వచ్చేస్తాడా.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం వెండితెర‌పై చూడాల్సిందే.

cinima-reviews
‘వెంకీ మామ’

విశ్లేషణ

పాత కాలం నాటి కథ.. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తే దర్శకుడు.. దీంతో ‘వెంకీ మామ’ చిత్రం కూడా రోటీన్ లాగే వున్నా కొంత కామెడీ ట్రాక్ తో ప్రథమార్థం రక్తి కడుతుంది. కాగా, ద్వీతాయార్థం మాత్రం మరీ కథ ఆకట్టుకోలేదు. భూతద్దం వేసి వెతికినా ఇందులో కొత్తదనం అన్నది కనిపించదు. ఓవైపు టెర్రరిస్టుల మీద ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ మీద ఒక ట్రాక్ నడిపిస్తూనే.. మరోవైపు జాతకాల సెంటిమెంటు చుట్టూ మూల కథను నడిపడంలో కొంత మేరకు సక్సెస్ అయినా.. పలు సందర్భాల్లో లాజిల్ మాత్రం కనబడదు. ఇక సాగదీతగా కూడా అనిపిస్తోంది. వెంకీ క్యారెక్టర్లో కొంత విషయం ఉండటం.. స్క్రీన్ ప్రెజెన్స్ అదీ బాగుండటం.. చైతూతో ఆయన కెమిస్ట్రీ వర్కవుట్ కావడం ‘వెంకీ మామ’లో చెప్పుకోదగ్గ సానుకూలతలు.

మేనల్లుడిని వెతుక్కుంటూ కశ్మీర్ కు వెళ్లే మామగా వెంకీ ఆరంభంలో కనిపించిన తీరు.. ఆయన చూపించిన ఇంటెన్సిటీ చూస్తే ఒక ఎమోషనల్ మూవీ చూడబోతున్న భావన కలుగుతుంది. ఐతే తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో మామా అల్లుళ్ల అనుబంధాన్ని ఎలివేట్ చేస్తూ సరదాగానే సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. మామను పెళ్లి వైపు నడిపించడానికి అల్లుడు.. అల్లుడి ప్రేమను సెట్ చేయడానికి మామ చేసే ప్రయత్నాలు కొంత మేర నవ్విస్తాయి. కానీ అందులోనూ కొత్తదనం ఏమీ కనిపించదు. ఒక దశ దాటాక ఈ ఎపిసోడ్లను సాగదీసిన భావన కలుగుతుంది.

ఐతే అక్కడక్కడా వెంకీ తనదైన శైలిలో వినోదం పండించడం.. వెంకీ మామ పాట ఆకట్టుకునేలా తీయడం.. యాక్షన్ సీక్వెన్సులు బాగానే పండటంతో ఫస్టాఫ్ టైంపాస్ కు ఢోకా ఉండదు. ద్వితీయార్ధంలో కథను మలుపు తిప్పాల్సిన చోట డ్రామా.. సెంటిమెంట్ డోస్ ఎక్కువైపోయాయి. జాతకాల చుట్టూ నడిపిన వ్యవహారం 80ల నాటి సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది. మామా అల్లుళ్లు విడిపోవడానికి దారితీసే పరిణామాలు మరీ నాటకీయంగా తయారయ్యాయి. ఇక్కడ అనుకున్న స్థాయిలో ఎమోషన్ పండలేదు. ఇక టెర్రరిస్టులపై సైన్యం దాడికి సంబంధించిన ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. కశ్మీర్ ఎపిసోడ్ అసలు ఈ సినిమాలో సింక్ అవ్వలేదు.

దాన్ని అంత పకడ్బందీగా ట్రెండీగా ఏమీ తీయలేదు. ముఖ్యంగా మిలిటరీలో పని చేసిన అనుభవమే లేని మామ.. అల్లుడి కోసం టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి వాళ్ల నాయకుడిని చంపేయడం.. దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యు అంచుల్లోకి వెళ్లి కూడా బతికేయడం అతిగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో ఉన్న ఇంప్రెషన్ కూడా.. సినిమా ముగింపులో తగ్గిపోతుంది. మొత్తంగా ‘వెంకీ మామ’ అంచనాలకు దూరంలోనే నిలిచిది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డవారికి ‘వెంకీ మామ’ ఓకే అనిపిస్తుంది 

నటీనటుల విషాయానికి వస్తే..

వెంకటేష్ ఈ సినిమాలో చాలా ఉత్సాహంగా నటించాడు. ఆయన లుక్ కూడా బాగానే కుదిరిందీ.. వయసుకు తగ్గ పాత్ర కావడంతో అలవోకగా చేసుకుపోయాడు. చైతూతో అతడి కెమిస్ట్రీ బాగా కుదిరింది. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో కూడా బాగానే అకట్టుకుంది. అతను ఉన్నంతలో బాగా చేసినా.. తన పాత్రను మరింత బాగా తీర్చిదిద్దాల్సింది. ఆర్మీ ఎపిసోడ్ లో చైతూ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. పాయల్ రాజ్ పుత్ పాత్ర ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఆమె అప్పీయరెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. రాశి ఖన్నాది కూడా మామూలు పాత్రే కానీ.. ఉన్నంతలో పాయల్ తో పోలిస్తే ఎక్కువ స్కోర్ చేసింది. విలన్లుగా రావు రమేష్.. దాసరి అరుణ్ కుమార్ పాత్రలు.. వాళ్ల నటన రొటీనే. ప్రకాష్ రాజ్, హైపర్ ఆది తమ పాత్రకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

మంచి ఫాంలో ఉన్న తమన్.. ‘వెంకీ మామ’ శైలికి తగ్గ సంగీతం అందించాడు. టైటిల్ సాంగ్ తో పాటు ‘కోకా కోలా పెప్సీ’ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాయికి తగ్గట్లే బాగా ఖర్చు పెట్టారు. సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు. దర్శకుడు బాబీ చాలా పరిమితులున్న రొటీన్ కథతో ఏ మ్యాజిక్ చేయలేకపోయాడు. అతను ఎక్కువగా వెంకీ మీద ఆధారపడ్డాడు. ఆయన చరిష్మాను బాగానే ఉపయోగించుకున్నాడు. మామా అల్లుళ్ల మధ్య కొన్ని సన్నివేశాలు.. ప్రథమార్ధంలో యాక్షన్ ఘట్టాల్ని.. పాటల్ని బాగానే తీశాడు. కానీ కథకు కొత్త ట్రీట్మెంట్ ఇవ్వడంలో.. ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించడంలో కొంత రోటిన్ అనిపిస్తోంది.

తీర్పు..

అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునే కథ, కథనంతో రూపోందిన కుటంబకథా చిత్రం..

చివరగా... ప్రేమానుబంధాలకు ప్రతీరూపం ‘వెంకీ మామ‘.!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh