Valmiki Review: Varun Tej's show all the way ‘వాల్మీకి’ సినిమా రివ్యూ

Teluguwishesh ‘వాల్మీకీ’ ‘వాల్మీకీ’ Director Vikram Kumar's Telugu movie Gang Leader featuring Nani, Priyanka Arul Mohan and Karthikeya in the lead roles, has received positive review and rating from the audience. Product #: 91184 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘వాల్మీకి’

 • బ్యానర్  :

  14 రీల్స్ ప్లస్

 • దర్శకుడు  :

  హరీష్ శంకర్

 • నిర్మాత  :

  రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట

 • సంగీతం  :

  మిక్కీ జే మేయర్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  అయానంక బోస్

 • ఎడిటర్  :

  చోటా కే ప్రసాద్

 • నటినటులు  :

  వరుణ్ తేజ్ - అధర్వ మురళి - పూాజా హెగ్డే - మృణాళిని రవి - బ్రహ్మాజీ- తనికేళ్ల భరణి త‌దిత‌రులు

Valmiki Movie Review And Rating

విడుదల తేది :

2019-09-20

Cinema Story

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (డీజే) ‘దువ్వాడ జగన్నాథం’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయి దర్శకుడు హరీష్ శంకర్.. తమిళ చిత్రం ‘జిగర్ తండ’ ఆధారంగా ‘వాల్మీకి’ @ గద్దలకొండ గణేష్ చిత్రాన్ని రూపోందించాడు. ఈ చిత్రంలో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలో వరుణ్ తేజ్ ను ఎంచుకుని.. ఆ పాత్రకు తనదైన టచ్ ఇచ్చి సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి తీసుకొచ్చాడు. విడుదలకు కొన్ని గంటల ముందు ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న సినిమా కథలోకి ఎంట్రీ ఇస్తే..

అభిలాష్ (అధర్వ మురళి) దర్శకుడు కావాలని కలలు కంటున్న కుర్రాడు. అతను రకరకాల కథలతో నిర్మాతల్ని కలుస్తాడు. కానీ ఏదీ వర్కవుట్ కాదు. ఒక గ్యాంగ్ స్టర్ కథ అయితే సినిమా నిర్మించడానికి సిద్ధమని ఓ నిర్మాత చెప్పడంతో.. ఒక నిజ జీవిత గూండా జీవితం ఆధారంగా కథ రాయాలని సంకల్పిస్తాడు బాలమురళి. ఈ క్రమంలో అతనికి దృష్టిని అకర్షించిన పేరు గద్దలకొండ గణేష్.

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లోని గద్దలకొండ అనే గ్రామంలో గణేష్ (వరుణ్ తేజ్) అనే గూండా చరిత్రనే కథగా రాయాలని సంకల్పిస్తాడు. ఆ ఊరికి వెళ్లి గణేష్ గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న దశలో బాలమురళి.. అనుకోకుండా గణేష్ వలలో చిక్కుతాడు. అప్పుడు గణేష్.. బాలమురళిని ఏం చేశాడు.. అతడి నుంచి తప్పించుకోవడానికి బాలమురళి ఏం చెప్పాడు.. ఇంతకీ ఈ గణేష్ కథేంటి.. తర్వాత పరిణామాలేంటి అన్నది మిగతా కథ.

cinima-reviews
‘వాల్మీకీ’

విశ్లేషణ

చాలా కొత్తగా అనిపించే కథ.. తమిళంలో కన్నా చిత్రాన్ని అద్భుతంగా తీయాలన్న హరీష్ ప్రయత్నం.. అందుకు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఎంచుకోవడం ఆయన చేసిన సాహసమే. తమిళంతో పోలిస్తే తెలుగులో ఆ పాత్ర టోన్ మార్చేశాడు. గెటప్ హావభావాలు నటన.. అన్నింట్లోనూ మార్పు చూపించాడు. తమిళంలో బాబీ సింహా పాత్రకన్నా ప్రాథాన్యతను కల్పించి.. హరీష్ తనదైన టచ్ ఇస్తూ తీర్చిదిద్దిన గద్దలకొండ గణేష్ పాత్ర.. అందులో వరుణ్ తేజ్ నటన పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ప్రేక్షకుల దృష్టి మరల్చనీయకుండా చేసిన ఆ పాత్రే సినిమాను నిలబెట్టేసింది. ‘వాల్మీకి’ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు.

ఈ పాత్ర స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల ఆసక్తి నిలిచి ఉండేలా చేయడంలో దర్శకుడు హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. పరిచయ సన్నివేశంతోనే గణేష్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. వరుణ్ ఏ తడబాటు లేకుండా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు.. సందర్భానుసారంగా భలేగా పేలాయి. గణేష్ కనిపించే తొలి సన్నివేశం తర్వాత అతడి క్రూరత్వాన్ని చాటిచెప్పే మరో రెండు సన్నివేశాలు కొంచెం రిపిటీటివ్ లాగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఆ పాత్రను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్.. ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతుంది.

ద్వితీయార్ధంలో ‘వాల్మీకి’ కథ ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందని విధంగా సాగుతుంది. ద్వితీయార్ధంలో ప్రేక్షకుడు కొత్త అనుభూతికి గురవుతారు. సినిమాలో సినిమా చుట్టూ మలుపు సాగే వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు సాధారణంగా అనిపించి.. ఇంకెప్పుడొస్తుంది ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ పాట అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది. ఐతే ఆ పాట.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ముగించిన తీరు ఆకట్టుకుంటాయి. హీరో తల్లి పాత్రకు ప్రాధాన్యం పెంచడం.. సెంటిమెంట్ కనెక్షన్ పెట్టడం బాగుంది. సినిమా ముగింపు కోసం ఆమె పాత్రను హరీష్ చక్కగా వాడుకున్నాడు.

అలాగే తనికెళ్ల భరణి పాత్ర ద్వారా కూడా హరీష్ చక్కగా ఎమోషన్ పండించాడు. ప్రి క్లైమాక్స్ లో చిత్రాన్ని సాగదీసినట్టు అనిపించినా.. ముగింపు మాత్రం మెప్పిస్తుంది. చివర్లో సుకుమార్.. నితిన్ ల క్యామియోలు కొసమెరుపుల్లా ఉపయోగపడ్డాయి. ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా సాగే కథ.. వరుణ్ పాత్రతో పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఆకర్షణలు ‘వాల్మీకి’లో చాలానే ఉన్నాయి. తమిళం నుంచి తీసుకున్న క్లాస్ కథకు హరీష్ ఇచ్చిన మాస్ టచ్ వల్ల మన ప్రేక్షకుల్ని మెప్పించేలాగే తయారైంది ‘వాల్మీకి’. మామూలుగా చూస్తే ‘వాల్మీకి’ మెప్పిస్తాడు.

నటీనటుల విషాయానికి వస్తే..

ఫిదా చిత్రంలో అక్కడక్కడా.. ఎఫ్ 2 చిత్రంలో పూర్తి క్యారెక్టర్ తెలంగాణ యాసలో మాట్లాడిన మెగా ప్రిన్స్ ఇప్పటికే నైజాం ప్రాంతంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ‘వాల్మీకి’ సినిమాతో వరుణ్ తేజ్ మాస్ డైలాగులు, యాస పూర్తిగా తెలంగాణవాసిగా మార్చివేశాయి. ఈ చిత్రంలో వరుణ్ నటుడిగా కొన్ని మెట్లు ఎక్కాడు. అతడి కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.

ఈ పాత్రకు వరుణ్ ను ఎంచుకున్నందుకు హరీష్ ను.. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు వరుణ్ ను అభినందించాల్సిందే. ఈ ఆలోచన దగ్గరే వీళ్లిద్దరూ మార్కులు కొట్టేశారు. వరుణ్ లుక్ - మేనరిజమ్స్ - బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ అన్నీ కూడా భలేగా కుదిరాయి. ఇప్పటిదాకా ఎక్కువగా సటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న వరుణ్.. తొలిసారి చాలా లౌడ్ గా అనిపించే పాత్రలో మెప్పించాడు.

సినిమాలో మిగతా పాత్రలన్నింటినీ అతను పక్కకు నెట్టేసి స్క్రీన్ మీద ఆధిపత్యం చలాయించాడు. అధర్వ మురళి ఉన్నంతలో బాగానే చేశాడు కానీ.. పాత్ర పరంగా వరుణ్ ముందు అతను చిన్నబోయాడు. పూజా హెగ్డే కనిపించిన కాసేపు తన అందంతో అలరించింది. ఎల్లువొచ్చి గోదారమ్మ పాటలో పూజా మెరిసిపోయింది. మృణాళిని రవి పర్వాలేదు. బ్రహ్మాజీ రౌడీ బ్యాచ్ కు నటన నేర్పించే పాత్రలో భలేగా నవ్వించాడు. చింతమల్లిగా సత్య కామెడీ కూడా అలరిస్తుంది. శత్రు - జబర్దస్త్ రవి - మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు రాణించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తనలోని కొత్త కోణాన్ని ‘వాల్మీకి’లో చూపించాడు. క్లాస్ టచ్ ఉన్న పాటలు - నేపథ్య సంగీతానికే పేరుపడ్డ అతను.. ‘వాల్మీకి’లో పూర్తిగా మాస్ పాటలు - ఆర్ ఆర్ చేశాడు. వాకా వాకా.. జర్రజర్ర లాంటి మాస్ బీట్స్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలో చాలానే మార్పు చూపించాడు మిక్కీ. తాను మాస్ సినిమాలకు గూస్ బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ఇవ్వగలనని రుజువు చేశాడు.

అయానంక బోస్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో అతడి కెమెరా కీలక పాత్ర పోషించింది. 14 రీల్స్ ప్లస్ బేనర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్.. రీమేక్ తీయడంలో మరోసారి తన నేర్పరితనం చూపించాడు. చాలా క్లాస్ గా కనిపించే ఆ చిత్రాన్ని తెలుగులో మాస్ కు చేరువ చేయడంలో మాత్రం అతను విజయవంతం అయ్యాడు. డైలాగుల్లో హరీష్ మార్కు కనిపిస్తుంది. ‘‘నమ్మకం ప్రాణం లెక్క. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు’’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కథనంలో అక్కడక్కడా బిగి సడలినప్పటికీ.. అనేక హంగులు అద్ది సినిమాను అతను జనరంజకంగానే మలిచాడు హరీష్.

తీర్పు..

‘వాల్మీకి ’ అలియాస్ గద్దలకొండ గణేష్ ఒక పూర్తి టైంపాస్ చిత్రం.. మాస్ అడియన్స్ అకర్షించేందుకు వచ్చిన మంచి క్లాస్ చిత్రం..

చివరగా... మాస్ అడియన్స్ ను అలరించనున్న ‘వాల్మీకి’..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh