Saaho Movie Review Rating Story Cast and Crew ‘సాహో’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘సాహో’ ‘సాహో’ Get information about Saaho Telugu Movie Review, Prabhas Saaho Movie Review, Saaho Movie Review and Rating, Saaho Review, Saaho Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 91010 3.00 stars, based on 1 reviews
  • చిత్రం  :

    'సాహో'

  • బ్యానర్  :

    యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌

  • దర్శకుడు  :

    సుజీత్‌

  • నిర్మాత  :

    వంశీ, ప్రమోద్

  • సంగీతం  :

    తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌

  • సినిమా రేటింగ్  :

    3.003.003.00  3.00

  • ఛాయాగ్రహణం  :

    మది

  • ఎడిటర్  :

    శ్రీకర్‌ ప్రసాద్‌

  • నటినటులు  :

    ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు

Saaho Movie Review

విడుదల తేది :

2019-08-30

Cinema Story

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. బాలీవుడ్‌ నటి శ్రద్ధ కపూర్‌ హీరోయిన్ గా… భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి ఈ సినిమా తెరకెక్కింది. ఇక బాహుబలి తర్వాత సుమారు రెండేళ్ల తరువాత ప్రభాన్ నుండి వస్తున్న సినిమా కాబట్టి అభిమానులు తీవ్ర నిరీక్షణ తరువాత వస్తున్న చిత్రమిది. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘సాహో’ మేనియా నడుస్తొందనడం అతిశయోక్తి కాదు.

రెండు వేలకోట్ల రూపాయలకు సంబంధించిన కథ సాహో. డేంజరస్ గ్యాంగ్ స్టర్స్ నిండి ఉన్న వాజీ సిటీ నుంచి 'సాహో' కథ మొదలవుతుంది. ఓ పెద్ద గ్యాంగ్ స్టార్ అయినా పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. కానీ రాయ్‌ (జాకీ ష్రాఫ్‌) క్రైం సిండికేట్‌ను నడిపిస్తూ తన కొడుకును ప్రపంచాన్ని పాలించే ఓ పెద్ద డాన్ గా చూడాలని ఆశ పడుతుంటాడు. ఓ రోడ్డు ప్రమాదంలో రాయ్ మరణిస్తాడు. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా ఎదుగుతాడు.

అదే సమయంలో విశ్వక్‌ కు చెందిన రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. దీంతో రెండు వారాల్లో పోయిన డబ్బునంతా సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. మరి విశ్వక్‌ ఆ డబ్బును సంపాదిస్తాడా..? లేదా..? ఈ కథ కు అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) కి సంబంధం ఏంటి..? అసలు అశోక్‌ చక్రవర్తి ఎవరు..? అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)..అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) ఎందుకు కలుస్తారు..? అసలు రాయ్‌ నిజంగా ప్రమాదంలో మరణించాడా.? లేక హత్య చేయబడ్డాడా.? ఈ ప్రశ్నలాంటికి సమాదానాలు కావాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

cinima-reviews
‘సాహో’

విశ్లేషణ

మ‌న్మ‌ధుడు అన్న పేరు విన‌గానే విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన క్లాసిక్ గుర్తుకు వ‌స్తుంది. మ‌ళ్లీ అలాంటి క్లాసిక్ తీశారా? అన్న ఆశ అభిమానుల‌కు ఉంది. అయితే ఈ విష‌యంలో కొత్త కుర్రాడు రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. ఇందులో వెన్నెల కిషోర్ తో ఫ‌న్ ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగినా .. క‌థాంశాన్ని గ్రిప్పింగ్ గా న‌డిపించ‌డంలో అత‌డు త‌డ‌బ‌డ్డాడు. క‌థ డ్రైవ్ లో ఫన్నీ సీన్స్ అయితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడిని ఆధ్యంతం నవ్విస్తాయి.

అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. పోర్చుగ‌ల్ నేప‌థ్యంలో తీశారు కాబ‌ట్టి ఆ బ్యూటీ అబ్బుర‌ప‌రిచింది. ప‌తాక స‌న్నివేశాల్లో ర‌కుల్- నాగ్ సీన్స్ లో ఎమోష‌న్ పండింది. కానీ స్క్రీన్ ప్లే ప‌రంగా ఇంకేదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశిస్తే అది క‌నిపించ‌దు. అయితే నేరేష‌న్ లో ఏదో మిస్స‌వుతోంది అన్న భావ‌నా ప్రేక్ష‌కుడిని వెంటాడుతుంది. ఎంచుకున్న లైన్ ఓకే కానీ.. న‌డిపించిన విధానంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బావుండేది.

నటీనటుల విషాయానికి వస్తే..

‘సాహో’ చిత్రంపై అభిమానులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా అంచనాలు పెరగడానికి కారణం ఆ చిత్ర టీజర్, ట్రైయిలర్. ప్రేక్షకులతో పాటు అటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు మొత్తంగా భారీ బడ్జెట్ తో ప్రభాస్ ‘సాహో’ తెరకెక్కింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో సుమారు 10,000 థియేటర్ల పైగానే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రాల తరువాత తొలిసారిగా ఒక ప్రాంతీయ భాషా చిత్రం హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో రూపోందించబడింది.

బాహుబలి’తో భారతీయ చలనచిత్ర రంగంతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రభాస్ తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. ఇక సాహో చిత్రంలో తన నటన, స్టైలిష్ లుక్స్ తో అసలు తెలుగు హీరోను చూస్తున్నామా.? లేక హాలీవుడ్ స్టార్ ను వీక్షిస్తున్నామా.? అన్న అనుమానం సినిమాను చూసిన ప్రతీ ఒక్కరికి కలగక మానదు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా ఇటు శ్రద్దా కపూర్ తో రోమాన్స్ లోనూ ప్రభాస్ మరోమారు డార్లింగ్ అనిపించాడు.

కథ విషయంలో దర్శకుడు సుజిత్ అనుకున్నది అనుకున్నటులగా అనేక ట్విస్టులు చూపారు. ‘సాహో’లో కావాల్సినంత స్టఫ్ వుంది. ప్రభాస్ నటన, లుక్స్ అదిరిపోయాయి. కొన్ని సన్నివేశాలలో అయితే హాలీవుడ్ హీరోను తలపిస్తాడు. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి ప్రభాస్ వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక చివరి 30 నిమిషాలు సినిమాను ప్లస్. రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్ కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం.. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, అతనిపై ఒత్తిడిని పెంచడంతో తడబాడ్డాడని కనిపిస్తోంది. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్‌ స్టోరి కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ మది కెమెరా పనితనంతో సత్తాచాటాడు. అందరి కంటే ఎక్కువ కష్టపడింది ఈయనే. సినిమా మొత్తం కూడా చాల కలర్ ఫుల్ గా చూపించాడు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ కేక పుట్టించారు. ప్రతి ఫైట్ హాలీవుడ్ సినిమాను తలపిస్తాయి.

జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఇలాంటి యాక్షన్ భరిత చిత్రాలకు నేపధ్య సంగీతం చాల ముఖ్యం. ఏ మాత్రం తేడా వచ్చిన సినిమా కే దెబ్బ. అలాంటిది పెద్దగా పేరులేని జిబ్రాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా డైరెక్టర్ ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా కు ప్రాణం పోసాడు. కాకపోతే పాటలే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే.. కేవలం ఒకే ఒక సినిమాను డైరెక్ట్ చేసిన ఇతడిని నమ్మి దాదాపు రూ. 350 కోట్లు పెట్టడం పెద్ద సాహసమే. నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సుజిత్.

తాను ఎలా అయితే రాసుకున్నాడో అదే ప్రకారం సినిమాను తెరకెక్కించారు. కాకపోతే కథలో కొత్తదనం లేదు. సినిమా మొదలైన కాసేపటికే యాక్షన్ మూవీ అని..గ్యాంగ్ స్టార్ల మధ్య సాగే పోరాటం అని తెలుస్తుంది. ప్రభాస్ ఎంట్రీ..తో సినిమా వేగం పెరుగుతుంది. డైలాగ్స్, కామెడీ , స్క్రీన్ ప్లే విషయంలో సుజిత్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. కేవలం యాక్షన్ మీదనే ఫోకస్ పెట్టాడు. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో షేడ్‌ ఆసక్తికరంగా ఉండడం అందరికి షాక్ ఇచ్చింది.

తీర్పు..

ప్రభాస్ సినిమా అంటూ భారీ అంచనాలు పెట్టుకోకుండా.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు వెళ్తున్నామని సరదాగా వెళ్లి.. పూర్తిగా 'సాహో' ఎంజాయ్ చేయండి.

చివరగా... తెలుగు వెండితెర నుండి.. అంతర్జాతీయ రేంజ్ చిత్రం ‘సాహో’..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh