Nannu Dochukunduvate Review - weekend entertainment movie క్లాసీగా దోచుకున్న వీకెండ్ ఎంటర్ టైనర్..

Teluguwishesh ‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ ‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ RS Naidu successfully manages to hold the attention for audiance in his latest movie Nannu Dochukunduvate with fun filled entertainment. The predictable cliches are tweaked and a fun narrative is maintained. Sudheer Babu plays a strict boss with no emotions like a professional. Product #: 88683 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  నన్ను దోచుకుందువటే

 • బ్యానర్  :

  సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌

 • దర్శకుడు  :

  ఆర్ఎస్ నాయుడు

 • నిర్మాత  :

  సుధీర్‌బాబు

 • సంగీతం  :

  అజ‌నీశ్ లోక్‌నాథ్‌

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  సురేశ్ రగుతు

 • ఎడిటర్  :

  ఛోటా కె ప్రసాద్

 • నటినటులు  :

  సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు

Nannu Dochukunduvate Movie Review

విడుదల తేది :

2018-09-21

Cinema Story

చిన్నతనంలో తల్లిని కోల్పోయిన హీరో తల్లి ప్రేమకు దూరమై.. హాస్టల్లో ఉండి చదువుకుంటూ అటు తండ్రి ప్రేమకు దూరం అవుతాడు. కట్ చేస్తే.. సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తూ వుంటాడు. అమెరికాకు ఎగిరిపోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలన్నది అతని డ్రీమ్‌. అలాంటి కార్తీక్‌ తన మరదలి సమస్యను పరిష్కరించడం కోసం సిరి అనే కొలీగ్ పాత్రను కల్పించి, తనను ప్రేమిస్తున్నానని తండ్రికి అబద్ధం చెబుతాడు. దీంతో షార్ట్ ఫిల్మ్‌లలో నటించే హీరోయిన్.. హీరో జీవితంలో ప్రవేశిస్తుంది. తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు.

హీరోయిన్ తన ప్రేమను వ్యక్తం చేసేలోగా ఆఫీస్ సమస్యల కారణంగా.. తనకు కెరీరే ముఖ్యం, ఇకపై కలవడం కుదరదని హీరో చెప్పేస్తాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ మళ్లీ హీరో కుటంబానికి తోడుగా ఉండాల్సి వస్తుంది. హీరో తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నా హీరోయిన్ కు చెప్పలేకపోతాడు. చివరకు హీరో తను కలగన్నట్టుగానే అమెరికా వెళ్లిపోయాడా..? లేదంటే హీరోయిన్ ప్రేమను పొందాడా? ప్రేమ బంధం వారిని కలిపిందా.? లేక విడివిడిగా బ‌తుకుతారా? లేకుంటే ఒక‌రినొక‌రు ఏదో ఒక సంద‌ర్భంలో అర్థం చేసుకుంటారా? నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ల‌కు స‌హ‌క‌రించిన అంశాలేంటి? వ‌ంటివి ఆస‌క్తిక‌రం.

cinima-reviews
‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ

విశ్లేషణ

హీరో సుధీర్‌బాబు నిర్మాతగా అవతారమెత్తి నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. తన పేరున సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మించిన చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానుల ఆదరణను అందుకుంటోంది. కన్నడ భామ నభా నతేష్ సుధీర్ బాబు సరసన నటించగా, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజ‌నీశ్ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు తన తొలి చిత్రంతో హిట్ సాధించాడు. చదువు, ఉద్యోగం, కెరీర్లో ఎదగడం.. ఇవి తప్ప నేటి యువతకు మరేది పట్టడం లేదు.
కెరీర్ గ్రోత్ అంటూ మెకానికల్‌గా బతికేస్తున్నారు. సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కాస్త ప్రేమ, ఫ్యామిలీ డ్రామాను కలిపి దర్శకుడు ‘నన్ను దోచుకుందువటే’ను తెరకెక్కించారు.మరదలితో పెళ్లి చేస్తామని కార్తీక్‌కు ఇంట్లో వాళ్లు చెప్తారు. కానీ ఆమె వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పడంతో కార్తీక్ సిరి గురించి నాన్నకు చెప్తాడు. ఆమెను చూసేందుకు నాజర్ హైదరాబాద్ రావడం, ఆమెతో బాగా కలిసిపోవడం.. కార్తీక్‌ కూడా ఆమెను ఇష్టపడటంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది.

కానీ ఇంటర్వెల్ ముందు నిన్ను కలవడం కుదరదని హీరో ట్విస్ట్ ఇస్తాడు. హీరోహీరోయిన్లు, వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ సీన్ సినిమా మొత్తానికే హైలెట్. సుధీర్ బాబు తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తొలి అర్ధబాగంతో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ ముందు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీసినట్టు అనిపించినప్పటికీ.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. మరి కాస్త ఎమోషన్‌ పండితే బాగుండేది. ఇక సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా నటన తెలిసిందే.

నటీనటుల విషానికి వస్తే

చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై హాస్టళ్లో పెరిగిన ఓ యువకుడి.. తన జీవితంలో కూడా ప్రేమ పెళ్లి అనే పదాలకు, బాంధవ్యాలకు దూరంగా వుంటూ అదే సమయంలో  కెరీర్ కోసం కష్టపడుతూ తన డ్రీమ్ ను సాధించాలనే యువకుడి పాత్రలో సుధీర్ బాబు నటన అదుర్స్. ముఖ్యంగా తొలిభాగంలో వచ్చే కామెడీ సీన్లలో అతడి యాక్టింగ్ చాలా బాగుంది.

ఇక చబ్బీ చబ్బీ అంటూ కన్నడనాట నుంచి వచ్చిన అందాల భామ నభా నతేష్ నటన కూడా అద్భుతంగా వుంది. హీరోతో అమె ప్రేమగా నటించే సన్నివేశాలు.. ఆ తరువాత తన కమిట్ మెంట్ కు తాను పరిమితం కావడం.. అంతా ఊహించిన కథే అయినా నభా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. అమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన పాత్రలోకి ఒదిగిపోయి నటించే సీనియర్ నటుడు నాజర్ జీవించారు. హీరోయిన్ తల్లి పాత్రలో తులసి పరిధి మేరకు నటించింది. వైవా హర్ష కామెడీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చూసింది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన ఆర్.ఎస్.నాయుడు తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకున్నారు. కొన్ని కొన్ని సీన్లను బాగా హ్యాండిల్ చేశారు. కథలో కొత్తధనం లేకపోయినా.. కథనంతో అకట్టుకునేలా చేశారు. ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవకుండా చేయడంలో దాదాపు సఫలమయ్యారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సుధీర్ బాబు మెప్పించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేప‌థ్య సంగీతం కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

తీర్పు..

ప్రేక్షకుడిని ఎక్కడా విసిగించకుండా, సరదాగా సాగిపోయే సినిమా ఇది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. వీకెండ్లో హాయిగా గడపాలని అనుకునేవారు హ్యాపీగా ఈ సినిమా చూసేయొచ్చు.

చివరగా... ప్రేక్షకుల హృదయాలను క్లాసీగా దోచుకున్న చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh