Touch Chesi Chudu Review and Rating | మూవీ రివ్యూ... టచ్ చేయకపోతేనే బెటరేమో!

Teluguwishesh టచ్ చేసి చూడు టచ్ చేసి చూడు Touch Chesi Chudu Movie Review and Rating. Debutante Director Vikram Sirikonda fails to impress Mass Raja Fans with Routine Cop Action Drama. Product #: 86711 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    టచ్ చేసి చూడు

  • బ్యానర్  :

    శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    విక్రమ్ సిరికొండ

  • నిర్మాత  :

    నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ

  • సంగీతం  :

    జామ్స్ (ప్రీతమ్)

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    రిచర్డ్ ప్రసాద్, ఛోటా కే నాయుడు

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, సుహాసిని, మురళీ శర్మ, ఫ్రెడ్డీ దారువాలా, సత్యం రాజేష్, జయప్రకాశ్ తదితరులు

Touch Chesi Chudu Review

విడుదల తేది :

2018-02-02

Cinema Story

పాండిచ్చేరిలో నివ‌సించే కార్తికేయ ఇండ‌స్ట్రీస్ అధినేత కార్తికేయ (ర‌వితేజ‌) కి కుటుంబం అంటే చాలా ప్రేమ‌. కుంటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అనుకునే స్వ‌భావి. హ్యాపీగా తన కుటుంబంతో చలాకీగా గడుపుతుంటాడు కార్తీకేయ(రవితేజ). తండ్రి కార్తీకేయకు సంబంధాలు చూసే క్రమంలో పుష్ప(రాశీ ఖన్నా) తో లవ్ స్టోరీ మొదలవుతుంది. ఈ క్రమంలో సెల్వమ్ అనే రౌడీ కార్తీకేయ కంపెనీకి రావాల్సిన గూడ్స్ ను ఎత్తుకెళ్తాడు. పోలీసులు పట్టించుకోకపోవటంతో కార్తీకేయ రంగంలోకి సమస్యను రెండు నిమిషాల్లో పరిష్కరించుకుంటాడు. 

అయితే కార్తీకేయకూ ఓ గతం ఉంటుందని అప్పుడు బయటపడుతుంది. అతని లక్ష్యం ఇర్ఫాన్ లాల్ అన్న విషయం తెలుస్తుంది. ఇంతకీ కార్తీకేయ గతం ఏంటి? ఇలా ఎందుకు చేస్తాడు? కార్తీకేయ వెతికే ఇర్ఫాన్ లాల్ ఎవరు? అన్నదే కథ.

cinima-reviews
టచ్ చేసి చూడు

చాలా గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న రవితేజ వెంటనే మరో చిత్రంతో మన ముందుకు వచ్చాడు. విక్రమ్ సిరికొండ అనే కొత్త వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు కాగా, ఇందులో మాస్ రాజా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్, ట్రైలర్ ద్వారా రివీల్ చేసేశారు. మంచి అంచనాలే ఉన్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

విశ్లేషణ...
టచ్ చేసి చూడు కథ.. కొత్తదేం కాదు. రెగ్యులర్ రివెంజ్ డ్రామానే. అయితే విక్రమ్ సిరికొండ లాంటి కొత్త దర్శకుడు ఇలాంటి చిత్రం చేస్తున్నప్పుడు.. పైగా అది రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోతో చేసే టైంలో ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా చూసుకోవాలి. కానీ, ఇక్కడ అలాంటి ప్రస్తావనే లేకుండా పోయింది. హీరో-హీరోయిన్ల మద్య రోటీన్ సన్నివేశాలతో ఫస్టాప్ బోరింగ్ గా గడిచిపోతుంది. ఇంటర్వెట్ ట్విస్ట్ తో ఊరట చెందే ప్రేక్షకుడు సెకండాఫ్ నుంచి బలమైన స్టోరీనే ఆశిస్తాడు.

కానీ, దర్శకుడు ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. రోటీన్ స్క్రిప్ట్ తో కథను లాగించేయటంతో ఒకానోక దశలో అసలు రవితేజ ఈ కథను ఎలా ఓకే చేశాడబ్బా? అన్న అనుమానాలు కూడా కలుగుతాయి. బ‌ల‌హీన‌మైన స్టోరీ , ఫ‌స్టాఫ్ అంతా ఫ్లాట్ గా న‌డ‌వ‌డం , ఎడిటింగ్ లో లోపాలు స్పష్టంగా క‌నిపిస్తాయి. సెకెండ్ ఆఫ్ లో కొన్ని యాక్ష‌న్ సీన్స్ పెట్టి మ‌మా అనిపించాడు. క‌థా ఆసాంతం ఫ్లాట్ గా అనిపించింది.

నటీనటుల విషయానికొస్తే.. రవితేజ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. కానీ, సీరియస్ మోడ్ లో కథ సాగిపోవటంతో ఆయన నుంచి అభిమానులు ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయారు. హీరోయిన్లు రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు నటనతో ఫర్వాలేదనిపించానా... గ్లామర్ పార్ట్ తో ఆకట్టుకున్నారు. మురళీ శర్మ, కాస్త గ్యాప్ తర్వాత కనిపించిన సుహాసిని మణిరత్నం తమ పాత్రలకు న్యాయం చేశారు. విల‌న్‌గా న‌టించిన ఫ్రిడేగా ఓకే. మిగతా వారు ఫర్వాలేదు.

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ప్రీతమ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ లౌడ్ నెస్ ఎక్కువైపోయింది. ఒకానోక స్టేజీలో ఇరిటేట్ కూడా చేస్తుంది. రిచర్డ్ ప్రసాద్, ఛోటా కే నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకుంది. డైలాగులు ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ నిర్మాణ సంస్థకు తగ్గట్లుగా లేవనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా వరకు కత్తెరకు పని చెప్పాల్సి ఉంది. 147 నిమిషాల ర‌న్ టైం కూడా సినిమాలో చాలా సీన్ల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.



తీర్పు..

క‌థ‌నంలో అక్క‌డ‌క్క‌డా మెరుపులు మెరిసినా, సెకెండ్ ఆఫ్ లో కొత్త‌సీసాలో పాత సారా అన్న చందంగా అనిపించింది. చూస్తే చూస్తారు.. లేకుంటే లేదు అనే చందాన సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో అలా తయారయ్యిందీ చిత్రం. రవితేజ వీరాభిమానులు మాత్రం ఓసారి ఎంజాయ్ చేసే మూవీ ఇది.

చివరగా.. టచ్ చేసి చూడు... టచ్ చేయకపోతేనే బెటరేమో!