Ungarala Rambabu Movie Review and Rating | ఉంగరాల రాంబాబు రివ్యూ.. బాబోయ్

Teluguwishesh ఉంగరాల రాంబాబు ఉంగరాల రాంబాబు Sunil's Ungarala Rambabu Movie Review and Rating. Ungarala Rambabu Complete Story and Synopsis. Product #: 84652 1.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఉంగరాల రాంబాబు

  • బ్యానర్  :

    యూనైటెడ్ మూవీస్

  • దర్శకుడు  :

    క్రాంతి మాధవ్

  • నిర్మాత  :

    పరుచూరి కిరిటీ

  • సంగీతం  :

    గిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    1.75  1.75

  • ఛాయాగ్రహణం  :

    సర్వేష్ మురారి

  • నటినటులు  :

    సునీల్, మియా జార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రాజ్ తదితరులు

Ungarala Rambabu Movie Review

విడుదల తేది :

2017-09-15

Cinema Story

రాంబాబు (సునీల్) తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయిన రోడ్డున్నపడతాడు. జనాల వీక్ నెస్ తో ఆడుకునే బాదం బాబా(పోసాని కృష్ణమురళి) అనే ఫేక్ స్వామిజీని ఆశ్రయిస్తాడు. అక్కడ బాబా ఇచ్చిన సలహాతో రాంబాబు ఫేట్ మళ్లీ మారిపోతుంది. తిరిగి కోటీశ్వరుడిగా మారటంతో బాదం బాబా ప్రియ భక్తుడిగా మారిపోతాడు. అదే సమయంలో జాతకాల మీద పిచ్చి పెంచేసుకుని ఉంగరాల రాంబాబుగా పేరు మార్చేసుకుంటాడు.

 

అయితే కొన్ని పరిస్థితులతో రాంబాబుకు మళ్లీ నష్టాలు ప్రారంభం అవుతుంటాయి. తాను చెప్పిన జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ మళ్లీ గాడిన పడుతుందని బాదం బాబా చెప్పటంతో ఆ ప్రయత్నంలో ఉంటాడు. సావిత్రి (మియా జార్జ్) ఆ జాతకానికి సరిగ్గా సరిపోవటంతో ప్రేమించటం మొదలుపెడతాడు. అదే సమయంలో ఆమె తండ్రి నుంచి వాళ్ల ప్రేమకు చిక్కులు ఎదురవుతాయి. డబ్బు కోసం ప్రేమలో పడ్డ రాంబాబు అనుకున్నది సాధించాడా.? వారి ప్రేమ గెలిచిందా..? అన్నదే మిగతా కథ.

cinima-reviews
ఉంగరాల రాంబాబు

కామెడీ నుంచి హీరోగా మారిన తర్వాత సునీల్ సక్సెస్ రేటు రాను రాను దారుణంగా పడిపోతూ వస్తోంది. చాలా కాలంగా అపజయాలే చవిచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ తో కలిసి ఉంగరాల రాంబాబుగా మన ముందుకు వచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై కాస్త అంచనాలే నెలకొన్నాయి. మరి సునీల్ కి ఎట్టకేలకు సక్సెస్ అందిందా? ఇంతకీ రాంబాబు ఎలా ఉన్నాడు? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ...

టీజర్ తో సినిమాలో ఏం లేదని చెప్పిన దర్శకుడు క్రాంతి మాధవ్.. ట్రైలర్ లో మాత్రం ఏదో కంటెంట్ ఉందన్న బిల్డప్ ఇచ్చాడు. కానీ, అదంతా ఉత్తదేనని ఉంగరాల రాంబాబు ఫ్రూవ్ చేసింది. ఎమోషనల్ కథలను స్లో పేస్ తో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడేనా అసలు ఈ సినిమా తీసింది అన్న సందేహాలు కూడా కలుగుతాయి.

హీరో ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయిపోవటం, బాబా చెప్పాడని లవ్ లో పడిపోవటం.. ఆమె తండ్రిని ఇంప్రెస్ చేయటం కోసం చేసే ప్రయత్నాలు.. రైతుల కోసం ప్రకాశ్ రాజ్ ధర్నాకు దిగే సన్నివేశాలు ఇవేవీ అంతగా ఆకట్టుకోకపోగా, చాలా చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ లో సో.. సో... కామెడీతో నడిపించిన దర్శకుడు సెకండాఫ్ లో పూర్తిగా కథను వదిలేశాడు. ముఖ్యంగా చివరి అరగంట అయితే ప్రేక్షకులకు పరీక్ష పెడుతుంది. ఓవరాల్ గా ఉంగరాల రాంబాబు ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోయాడు.

నటీనటుల ఫెర్ ఫార్మెన్స్... హీరోగా సత్తా చాటేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తున్న సునీల్ తన పాత్ర వరకు న్యాయం చేసినా.. ఎందుకనో అంచనాలను అందుకోలేకపోయాడు. అన్నింటిలోనూ పాత చిత్రాలను గుర్తుకు తెచ్చేలాగానే చేశాడు. హీరోయిన్ లుక్స్ పరంగా కూడా అంత ఆకర్షణీయంగా లేదు. నటన జస్ట్ ఓకే. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచాడు. వీరిద్దరే సినిమాను కాసేపు ఆదుకునే యత్నం చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిందేం లేదు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. గిబ్రాన్ సంగీతంతో సినిమాను ఒరిగిందేం లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫి కాస్త ఊరట కలిగిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైలాగులు, స్క్రీన్ ప్లే, ఇలా దేంట్లోనూ క్రాంతి మాధవ్ మార్క్ అస్సలు కనిపించదు.

ప్లస్ పాయింట్స్ :


ఫస్టాఫ్
కొన్ని కామెడీ సీన్లు

 


మైనస్ పాయింట్స్ :


కథా కథనం
సంగీతం


తీర్పు:

ఇప్పటిదాకా అందించిన రెండు చిత్రాలు కూడా మనసును తాకేవే. అయితే తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో ఓ రొటీన్ కామెడీ ఎంటైర్ టైనర్ ను అందించాడు. మంచి కాస్టింగ్ ఎంచుకుని వారి నుంచి మంచి అవుట్ పుట్ ను మాత్రం అందించలేకపోయాడు.

చివరగా.. ఉంగరాల రాంబాబు... పరమ బోరింగ్ బాబు