ధృవ మూవీ రివ్యూ | Dhruva movie review.

Teluguwishesh ధృవ ధృవ Ram Charan's Dhruva movie review. Product #: 79516 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ధృవ

  • బ్యానర్  :

    గీతా ఆర్ట్స్

  • దర్శకుడు  :

    సురేందర్ రెడ్డి

  • నిర్మాత  :

    అల్లు అరవింద్

  • సంగీతం  :

    హిప్ హప్ తమీజ్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    పీఎస్ వినోద్

  • ఎడిటర్  :

    నవీన్ నూళి

  • నటినటులు  :

    రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని, నవదీప్, మధు సింగంపల్లి తదితరులు

Dhruva Movie Review

విడుదల తేది :

2016-12-09

Cinema Story

కథ:

తన తండ్రిని ఎమ్మెల్యేని చేయాలన్న కండిషన్ తో చిన్నతనంలోనే మర్డర్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్తాడు సిద్ధార్థ అభిమన్యు(అరవింద స్వామి). కట్ చేస్తే... కొన్నేళ్ల తర్వాత ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉంటూనే తన బ్యాచ్ మేట్లతో కలిసి సిటీలో జరిగే చిన్న చిన్న క్రైం ను అడ్డుకుంటుంటాడు ధృవ (రాంచరణ్). అయితే ఓ కేసులో నిందితుడు పొలిటికల్ సపోర్ట్ తో వెంటనే బయటికి వచ్చేయటం ధృవ ఫ్రెండ్స్ కి అసహనం తెప్పిస్తుంది. 

ఈ క్రమంలో తాను చేస్తున్న సీక్రెట్ రీసెర్చి గురించి వివరంగా తన టీంకు చెప్పి, ఈ నేరాలన్నింటికి వెనుక ఉన్న అసలు వాళ్లను నాశనం చేయటమే తన గోల్ అని చెబుతాడు. సిటీలో ఇల్లీగల్ దందాలు చేసే ముగ్గురు బిజినెస్ మెన్ ల టార్గెట్ చేసిన ధృవకి, వాళ్ల వెనకాల ఉంది పేరు ప్రఖ్యాతులులున్న సైంటిస్ట్ సిద్ధార్థ అభిమన్యు అని తెలుసుకుంటాడు. అతని పనులను అడ్డుపడే క్రమంలో ఇద్దరికీ వైరం మొదలౌతుంది. ఈ క్రమంలో ధృవ గాయపడటంతోపాటు, అతని స్నేహితుడు ప్రాణాలు కూడా కోల్పోతాడు. 

ఇక ఆ గాయాల నుంచి కోలుకొని సిద్ధార్థ్ మైండ్ గేమ్ కి చెక్ పెడుతూ అతని నేర సామ్రాజ్యాన్ని కొంచెం కొంచెంగా కూలగొడతాడు. చివరకు సిధ్ధార్థ్ ఏమౌతాడు? ధృవ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడా? ధృవ అసలు పోలీస్ ఆఫీసర్ కావాలన్న పట్టుదల వెనక ఎవరున్నారు? అన్నదే కథ. 

cinima-reviews
ధృవ

గత రెండు చిత్రాలు ఫ్లాప్ కావటంతో మెగా పవర్ స్టార్ కన్ను ఈసారి రీమేక్ పై పడింది. తమిళ్ లో సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన తని ఒరువన్ సినిమాను  రేసుగుర్రం లాంటి స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డితో రీమేక్ చేయించాడు. జయం రవి-అరవింద స్వామి కెమిస్ట్రీ అద్భుతంగా పడండటంతో కోలీవుడ్ లో తని ఒరువన్ సంచనాలు సృష్టించింది. మరి తెలుగులోనూ అదే హవా చాటిందా? చెర్రీ పడ్డ సిక్స్ ప్యాక్ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇంతకీ హిట్ కొట్టాడా?  తెలుసుకుందాం పదండీ. 

విశ్లేషణ:

మెగా బ్యాగ్రౌండ్ ఉన్న హీరో రీమేక్ అనగానే తొలుత కొన్ని అనుమానాలు కలిగాయి. అయితే అల్రెడీ హిట్ సినిమా కావటంతో ఏమైనా మార్పులు చేసి ఉంటాడా? అన్న ప్రశ్నలే ఎక్కువ కలిగాయి. పైగా చాలా మంది చూసేసి ఉండేసరికి ప్రతీ విషయంలోనూ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తారు.

కానీ, దర్శకుడు సురేందర్ రెడ్డి అలాంటి ఫిర్యాదులు ఏం లేకుండా ధృవను తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసి ఇది రీమేక్ సినిమా అన్న విషయం మరిచిపోయేలా చిత్రీకరించాడు. అంతగా ఆకట్టుకోని పాటలు, సినిమా లెంగ్త్ ఎక్కువైందన్న ఫిర్యాదు ఒక్కటే అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. రాంచరణ్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ తో కూడా టోటల్ గా మారిపోయింది. ఎమోషనల్ సన్నివేశాలతోపాటు, టైమింగ్ లోనూ కొత్త చెర్రీ కనిపించాడు. అయితే డైలాగ్ డెలీవరియే కొంచెం తడబడినట్లు అనిపించకమానదు. ఇక తర్వాత చెప్పుకోదగింది అరవింద స్వామి. తమిళ్ లో ఏ పాత్ర అయితే పోషించాడో.. తెలుగులోనూ అదే స్థాయిలో నటించాడు. శత్రువు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమాకు అంత బలం అన్న పాయింట్ ను ఈ ఇద్దరి కాంబో బాగా కుదిరింది. ఇక రకుల్ యాక్టింగ్ ఓకే. సాంగ్ లో మాత్రం అందాలు ఆరబోసింది. పోసాని పాత్ర ఫన్నీగా ఉన్నా.. చివర్లో మరీ బఫూన్ గా మార్చేశారు. నవదీప్, విద్యుల్లేఖ తదితర పాత్రలు తమ వంతు పాత్రను పోషించాయి.

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే... హిప్ హప్ తమిళ అందించిన పాటలు వినటానికి సోసోగా ఉన్న విజువల్ గా మాత్రం అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. పి ఎస్ విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
రాంచరణ్, అరవింద్ స్వామి కాంబినేషన్
సురేందర్ రెడ్డి రేసీ స్క్రీన్ ప్లే
బ్యాగ్రౌండ్ స్కోర్



మైనస్ పాయింట్స్ :
పాటలు
సినిమా లెంగ్త్

తీర్పు:

స్వేచ్ఛ తీసుకున్న సురేందర్ రెడ్డి ధృవలో ఏ మార్పులు చేయకపోయినప్పటికీ, జస్ట్ తెలుగు నెటివిటీకి తగ్గట్లు మార్పులు మాత్రం బాగా చేశాడు. రాంచరణ్, అరవింద స్వామిల పోటా పోటీ యాక్షన్ కి, ఫాస్ట్ గా సాగే స్క్రీన్ ప్లేకి, యాక్షన్ సీక్వెన్స్ కి సరిగ్గా సరిపోవటం, మాతృక కంటే కాస్త స్టైలిష్ గా తెరకెక్కటం కలిసొచ్చే అంశాలు.  


చివరగా... ధృవ అన్నివర్గాలను ఆకట్టుకునే ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 

 

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.