సాహసం శ్వాసగా సాగిపో రివ్యూ | Sahasam Swasaga Sagipo Movie Review

Teluguwishesh సాహసం శ్వాసగా సాగిపో... సాహసం శ్వాసగా సాగిపో... Sahasam Swasaga Sagipo Telugu Movie Review. Product #: 78956 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సాహసం శ్వాసగా సాగిపో...

  • బ్యానర్  :

    ద్వారకా క్రియేషన్స్

  • దర్శకుడు  :

    గౌతమ్ మీనన్

  • నిర్మాత  :

    మిర్యాల రవీందర్ రెడ్డి

  • సంగీతం  :

    ఏఆర్ రెహ్మాన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • నటినటులు  :

    నాగ చైతన్య, మాంజిమా మోహన్, బాబా సైగల్, సతీష్ కృష్ణన్ తదితరులు

Sahasam Swasaga Sagipo Movie Review

విడుదల తేది :

2016-11-11

Cinema Story

రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. బీటెక్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓరోజు తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో  మొదటి చూపులోనే లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే లీలా ఓ కోర్సు  కోసం తన ఇంట్లోనే మకాం వేయటంతో అతని పని మరింత సులువు అయిపోతుంది. ఇదిలా ఉండగా కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం చెప్పటంతో లీలా కూడా అతనితో బయలుదేరుతుంది. 

 

ఈ ప్రయాణంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మరింత ముదురుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో అనుకోకుండా వాళ్లకు యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలాతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీ. అయితే ఎలాగోలా ప్రాణాలతో బటయపడ్డ రజనీకి అది యాక్సిడెంట్ కాదని, లీలాను చంపే ప్రయత్నం అని తెలుస్తుంది. అప్రమత్తం అయ్యేలోపే లీలా పేరెంట్స్ తోపాటు, తన స్నేహితుడిని కూడా చంపేస్తారు. అసలు అదంతా చేస్తున్నది ఎవరూ? లీలా కుటుంబానికి వాళ్లకి లింకేంటి? వాళ్లని కనిపెట్టి చివరకు రజనీ ఏం చేశాడు? అన్నదే కథ. 

 

cinima-reviews
సాహసం శ్వాసగా సాగిపో...

విశ్లేషణ:
చైతూతో ఏ మాయ చేశావే లాంటి రొమాంటిక్ చిత్రం తీసిన గౌతమ్ మీనన్ ఈసారి ఫుల్ పాక్ట్ యాక్షన్ సబ్జెక్ట్ తో వచ్చాడు. అలాగని ఇందులోనూ లవ్, కెమిస్ట్రీ కూడా ఉంది. కానీ, అది కేవలం ఫస్ట్ హాఫ్ లోనే... ఇక రెండో భాగం మొత్తం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం చేశాడు. అయితే ఈ లవ్ స్టోరీలో ఏం మాయ చేశావే తో కంపేర్ చేసుకోకుండా ఉండటమే మంచింది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఇందులో లేదు కాబట్టే. అయితే దాంతో కంపేరిజన్ చేసినట్లు కొన్ని సన్నివేశాలు ఉండటం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు ఆ ట్రాక్ అంతా మరీ నిదానంగా సాగినట్లు అనిపించకమానదు. సెకండాఫ్ వచ్చేసరికి అల్రెడీ బెడ్ మీద ఉన్న హీరోకి హీరోయిన్ ఫోన్ చేసి మరీ తన ఫ్యామిలీ ఆపదలో ఉందని చెప్పటం, అయినా హీరో అక్కడికి పరిగెత్తటం, అక్కడక్కడా యాక్షన్ ఎపిసోడ్లు.. ఈ గజిబిజి గందరగోళం అంతా కన్ఫూజ్యన్ గా అనిపించకమానదు.

ఇక నటీ నటులు విషయానికొస్తే... ఇప్పటిదాకా యాక్షన్ హీరోగా ఫెలవుతూ వచ్చిన చైతూ ఈసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్ లోనూ అలరించాడు. డాన్సుల్లో మాత్రం మైనస్ గానే నిలిచాడు. ఈ విషయంలో హీరో ఫ్రెండ్ గా చేసిన సతీష్ కృష్ణన్ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్లో కనిపిస్తూ, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ ల ఎంపికలో డస్కీ బ్యూటీల మార్క్ చూపించాడు గౌతమ్ మీనన్. విలన్గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణులు... దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగట్టుగా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
నాగ చైతన్య నటన,
రెహ్మాన్ మ్యూజిక్.

 

మైనస్ పాయింట్లు:
స్లో నారేషన్,
సెకండాఫ్ లో లవ్ ట్రాక్ సైడ్ అయిపోవటం

తీర్పు:
ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది. రెగ్యులర్ ఫ్లేవర్ ఆశించేవారికి నచ్చకపోవచ్చుగానీ, టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది.


చివరగా... రొమాంటిక్ + యాక్షన్ తో  జస్ట్ సో సో గా సాగిపోయే సాహసం.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.